అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) గారి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.80వ దశకంలో ఏఎన్ఆర్ తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్రనే వేసుకున్నారు.నందమూరి తారక రామారావు ( Nandamuri Taraka Rama Rao )గారి ఆధ్వర్యంలో పౌరాణిక సినిమాలు రాజ్యమేలుతున్న తరుణంలో… అక్కినేని వారు ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో సాంఘిక సినిమాలు చేస్తూ, ఎన్టీఆర్ గారికి చాలా గట్టి పోటీ ఇచ్చేవారు.ఇదే విషయాన్ని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు అనేక సందర్భాలలో వెల్లడించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది.
ఇక దేవదాసు ( Devadasu )అనే సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు తన నటన ప్రతిభను దేశం మొత్తం తెలిసేలా చేశారు.

అప్పట్లో దేవదాసు సినిమా ఇండియాలోనే సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.భారతీయ భాషలు అన్నిటిలోనూ ఈ సినిమా తెరకెక్కగా, ఒక్క మన తెలుగు సినిమాకి వచ్చిన పేరు మరే భాషలో సినిమాకి రాలేదు అనడంలో అతిశయోక్తి లేదు.అయితే ఒక దేవదాసు సినిమా ఏమిటి, చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఆ లిస్టులో ఉన్నాయి.
అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎన్నో అవమాలను పడ్డారనే సంగతి చాలామందికి తెలియదు.

సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో నాగేశ్వరరావు గారు చాలా స్టూడియోలు చుట్టూ తిరిగేవారట.అందులో కొందరు మళ్ళీ మళ్ళీ రమ్మని కాళ్లు అరిగేలా తిప్పితే, మరికొందరు… నీ ముఖం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా? ఇంత సన్నంగా ఉన్నావు… నువ్వు సినిమాలకు పనికి రానే రావు! అని దూషించే వారట.అయితే సక్సెస్ ఊరకనే రాదు కదా? ఎన్నో అవమానాల మధ్య అక్కినేని వారు హీరోగా నిలదొక్కుకున్న తీరు చూస్తే… నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం అని అనిపించక మానదు.ఒక్కగానొక్క సందర్భంలో అయితే నందమూరి తారక రామారావు గారికి ఏఎన్ఆర్ బలమైన పోటీ ఇచ్చేవాడని సమాచారం.ఆ సందర్భంలో తారక రామారావు గారు తోటి అనుచరులతో… వీడేంటి మనకే మేకై కూర్చునే లా ఉన్నాడు అని చమత్కారంగా మాట్లాడేవారని వినికిడి.