2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు, మిడిల్ రేంజ్ హీరోలకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.

అయితే సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రమే ఈ క్రేజ్ కొనసాగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కొన్ని సినిమాలు మాత్రం ఈ ఏడాది టాలీవుడ్( Tollywood ) ను ముంచేసిన డిజాస్టర్లుగా నిలిచాయి.ఈ సినిమాలు థియేటర్లలో పట్టుమని మూడు రోజులు కూడా ఆడలేదంటే ఈ సినిమాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఏడాది భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో మట్కా మూవీ( Matka Movie ) ముందువరసలో ఉంటుంది.ఈ సినిమాకు 40 కోట్ల రూపాయలు ఖర్చైతే 4 కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా రాలేదు.

వెంకటేశ్ సైంధవ్ మూవీ( Saindhav movie ) కూడా భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై భారీ నష్టాలను మిగిల్చింది.గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న శర్వానంద్ కు మనమే( Maname ) రూపంలో భారీ షాక్ తగిలింది.

Advertisement

ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలో( OTT ) అందుబాటులోకి రాకపోవడం కొసమెరుపు.రవితేజ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ ( Mr.Bachchan )కూడా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైంది.రామ్ పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ ( Double smart )తో డబుల్ బ్లాక్ బస్టర్ సాధిస్తారని ప్రేక్షకులు భావించగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్, రవితేజ ఈగల్ సినిమాలు సైతం ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి.

విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, రాజ్ తరుణ్ తిరగబడరా సామీ భలే ఉన్నాడే పురుషోత్తముడు, అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాలతో నిరాశపరిచారు.ఈ సినిమాలు నిర్మాతలకు తీవ్రస్థాయిలో నష్టాలను మిగిల్చాయి.ఈ సినిమాల ఫలితాల వల్ల కొందరు నిర్మాతలు ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి నెలకొందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు 3 సంవత్సరాలకు సరిపడ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా..?
Advertisement

తాజా వార్తలు