ఒకే సినిమాలో హీరో విలన్ రెండు రోల్స్ చేసిన హీరోలు వీళ్లే..!

చలనచిత్ర పరిశ్రమలో హీరోలుగా రాణించినవారు తొలి రోజుల్లోనే కథానాయకుడు పాత్రల్లో నటించలేదు ఉదాహరణకి రవితేజ( Ravi Teja ).

చిన్న పాత్రలు చేసుకుంటూ చివరికి హీరోగా మారి ఆపై బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇక కొందరైతే కెరీర్ తొలినాళ్లలో విలన్ రోల్స్ చేసి ఆ తర్వాత హీరోలుగా మారారు.చక్కటి నటన, అందానికి అందం, మంచి ఫిజిక్ కారణంగా వీరిలో హీరోలను దర్శకులు చూడగలిగారు.

వారు కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల కంటే హీరోగా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకోవాలని కథానాయకుడి పాత్రలు చేయడం మొదలుపెట్టారు.కొంతమంది హీరోలు అయితే ఒకే సినిమాలో విలన్, హీరో రెండు పాత్రలను పోషించి ఆశ్చర్యపరిచారు.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అలాంటి వారు చాలామందే ఉన్నారు.వారిలో ముఖ్యమైన హీరోల గురించి చెప్పుకుందాం.

* కమల్ హాసన్ – అభయ్

Advertisement

మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్, కోలీవుడ్ హీరో కమల్ హాసన్ ( Kamal Hasan ) అభయ్(2001) సినిమాలో విలన్ గా, హీరోగా నటించాడు.దానికి ముందు ఆయన విలన్‌గా చేసిన సినిమా ఏదీ లేదు.అభయ్‌లో ప్రతి నాయకుడిగా, హీరోగా చేసే అవకాశం దక్కింది.

తన నటనా నైపుణ్యంతో కథానాయకుడి పాత్రను అవలీలాగా చేసి వావ్‌ అనిపించాడు.అలా ఎన్నో సినిమాల్లో హీరోగా చేస్తూ మళ్ళీ దశావతారంలో ప్రతి నాయకుడి పాత్ర పోషించి అలరించాడు.

* విక్రమ్ – ఇంకొక్కడు

అపరిచితుడు ఫేమ్ విక్రమ్ ఇంకొక్కడు (2016)( Inkokkadu ) సినిమాలో విలన్ పాత్ర చేసి మెప్పించాడు.

* రజినీకాంత్ – రోబో

డైరెక్టర్ శంకర్ రూపొందించిన రోబో మూవీలో( Robo ) రజనీకాంత్ హీరోగానే కాకుండా విలన్‌గా కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

* అజిత్ – వాలి

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

కోలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అజిత్ వాలి (1999)లో ట్విన్ బ్రదర్స్ పాత్రలలో యాక్ట్ చేశాడు.అందులో ఒక రోల్‌కి నెగిటివ్ షేడ్స్ ఉంటాయి.

* సూర్య – 24

Advertisement

టాలెంటెడ్ హీరో సూర్య 24 అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రతి నాయకుడిగా యాక్ట్ చేసి ఆకట్టుకున్నాడు.విక్రమ్ కె కుమార్ దీనిని డైరెక్ట్ చేశాడు.

* కార్తీ – కాష్మోరా

సూర్య తమ్ముడు కార్తీ కాష్మోరా (2016)లో( Kashmora ) హీరో, విలన్ రెండు రోల్స్‌ చేసి వావ్ అనిపించాడు.

* బాలకృష్ణ – సుల్తాన్

సుల్తాన్ (1999) మూవీలో బాలకృష్ణ ఎనిమిది పాత్రలు పోషించి వావ్ అనిపించాడు.వాటిలో ఒక విలన్ పాత్ర కూడా ఉంది.

* గోపీచంద్ – గౌతమ్ నంద

సంపత్ నంది డైరెక్ట్ చేసిన "గౌతమ నందా"లో గోపీచంద్ డ్యూయల్ రోల్స్ పోషించాడు.వాటిలో ఒకటి నెగెటివ్ రోల్ కాగా మరొకటి పాజిటివ్ రోల్.

* జూ.ఎన్టీఆర్ – జై లవ కుశ

జై లవకుశ( Jai Lavakusa ) సినిమాలో ప్రతి నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు.

* వెంకటేష్ – నాగవల్లి

నాగవల్లిలో( Nagavalli ) వెంకటేష్ వందేండ్లు దాటిన రాజు, యంగ్ ఏజ్ హీరో 22 రోల్స్ చేయగా అందులో ఒకటి విలన్ పాత్ర.

తాజా వార్తలు