తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథ మాటలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రైటర్ త్రివిక్రమ్( Trivikram ) ఇక ఆ తర్వాత ఆయన దర్శకుడి గా మారి వరుస సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ కూడా అందుకున్నాడు.ఆయన చేసిన గుంటూరు కారం సినిమా ( Guntur Karam Movie ) ఆశించిన మేరకు విజయం సాధించలేదు అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ గనుక కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో రాసిన స్టోరీ బాగానే ఉన్నప్పటికీ అది మరీ రొటీన్ స్టోరీ అవ్వడం వల్ల ఈ సినిమా పెద్దగా ఆడలేదని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
నిజానికి త్రివిక్రమ్ చేసిన సినిమాలన్నీ ఒకే పాటర్న్ లో ఉంటాయి.ఇక ఆయన చేసిన సన్నాఫ్ సత్యమూర్తి( Son Of Satyamurthy), అత్తారింటికి దారేది( Attarintiki Daredi ), అజ్ఞాతవాసి( Agnathavasi ), గుంటూరు కారం లాంటి సినిమాలు ఒకే పాటర్న్ లో ఉంటాయి.ఇక ఈ సినిమా చూసిన సగటు ప్రేక్షకుడికి ఆ సినిమాలు చూసినట్టుగా అనిపించింది.అందువల్లె ఈ సినిమా ఫ్లాప్ అయింది తప్ప, మహేష్ బాబు( Mahesh Babu ) నటన పరంగా గాని ఆయన ప్రజెంటేషన్ పరంగా గాని, ఎక్కడ కూడా ప్రేక్షకులను నిరాశ పరచట్లేదు.
ఇక ఒకప్పుడు ఎలాగైతే నటిస్తూ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ వచ్చాడో ఇప్పుడు కూడా అలాంటి పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చాడు.అయినప్పటికీ ఈ సినిమా ఫ్లాప్ వెనక త్రివిక్రమే కారణం అంటూ చాలా మంది మహేష్ బాబు కి సపోర్టుగా మాట్లాడుతున్నారు.
ఇక ఈ సినిమా అనే కాకుండా మరొక దర్శకుడు చేసిన సినిమా కూడా డైరెక్టర్ వల్లే ప్లాప్ అయిందనే విషయం మన అందరికి తెలిసిందే.ఏ ఆర్ మురుగదాస్( AR Murugadoss ) డైరెక్షన్ లో మహేష్ బాబు చేసిన స్పైడర్ సినిమా( Spyder Movie ) ప్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం మురుగ దాస్ అనే చెప్పాలి.ఈ సినిమా మహేష్ ఇమేజ్ కి సరిపోయే కథ కాదు.ఇక ఇలాంటి మహేష్ బాబు లాంటి ఒక స్టార్ హీరో దొరికినప్పుడు ఒక కమర్షియల్ యాంగిల్ లో కథలు చెప్పే ప్రయత్నం చేయాలి.
కానీ కొత్త హీరోతో చేసినట్టుగా ఇలాంటి ఒక సినిమా చేయడం అనేది సరైన విషయం కాదు అంటూ ఇప్పటికి చాలా మంది చెబుతూ ఉంటారు…
.