అనుదీప్ నుండి రాజమౌళి వరకు తమ సినిమాలో తామే నటించిన దర్శకులు

సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు, పలు క్యారెక్టర్లు చేసే ఆర్టిస్టులు మాత్రమే తెర మీద కనిపిస్తారు.

కానీ కొందరు దర్శకులు కూడా తమ సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ.

ఆడియెన్స్ లో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు.ఇంత వరకు ఏ దర్శకుడు ఏసినిమాల్లో కనిపించాడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పూరీ జగన్నాథ్

Tollywood Directors Who Acted In Their Own Films, Tollywood Directors,tollywood

ఈ మాస్ దర్శకుడు మహేష్ బాబు హీరోగా వచ్చిన బిజినెస్ మ్యాన్ సినిమాలలో కనిపించాడు.టాక్సీడ్రైవర్ గా వచ్చి హీరోయిన్ ను కిడ్నాప్ చేసే సీన్ లో కనిపిస్తాడు.ఎన్టీఆర్ మూవీ టెంపర్, రామ్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లోనూ కనిపించాడు.

శేఖర్ కమ్ముల

Tollywood Directors Who Acted In Their Own Films, Tollywood Directors,tollywood

మంచి కథలతో కూల్ చిత్రాలు తీసే శేఖర్ కూడా పలు సినిమాల్లో కనిపించాడు.ఆనంద్ సినిమాలో ఆటో డ్రైవర్ గా చేశాడు.అటు లీడర్ సినిమాలోనూ తెరపై మెరిశాడు.

రాజమౌళి

Tollywood Directors Who Acted In Their Own Films, Tollywood Directors,tollywood
Advertisement
Tollywood Directors Who Acted In Their Own Films, Tollywood Directors,tollywood

దర్శకధీరుడు రాజమౌళి కూడా పలు సినిమాల్లో కనిపించాడు.మొదటిసారి సై సినిమాలో కనిపించాడు.తర్వాత బాహుబలి సినిమాలో కల్లు అమ్మే వ్యక్తి పాత్రలో కనిపించాడు.

వివి వినాయక్

ఈయన కూడా పలు సినిమాల్లో నటించాడు.తొలిసారి చిరంజీవి సినిమా ఠాగూర్ లో కనిపించాడు.ఆ తర్వాత మళ్లీ చిరు సినిమా అయిన ఖైదీ నెం 150లో కనిపించాడు.

తాజాగా వినాయక్ హీరోగా ఓ సినిమా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్ అడ్డాల

ఫ్యామిలీ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ సైతం రెండు సినిమాల్లో కనిపించాడు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహేష్ బ్రహ్మోత్సవం చిత్రాల్లో చిన్న గెటప్ వేశారు.

క్రిష్

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

వేదం సినిమాలో స్వామీజీ క్యారెక్టర్ చేశాడు క్రిష్.

శ్రీను వైట్ల

Advertisement

తను దర్శకత్వం వహించిన దుబాయ్ శ్రీను సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు శ్రీను వైట్ల.

సురేందర్ రెడ్డి

హీరో రవితేజతో కలిసి తెరమీద కనిపించాడు ఈ కిక్ 2 దర్శకుడు సురేందర్ రెడ్డి

సందీప్ వంగ

అర్జున్ రెడ్డి సినిమాలో కనిపించాడు దర్శకుడు సందీప్

ఓంకార్

రాజు గారి గది సినిమాలో ఓ రోల్ చేశాడు ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్.

అనుదీప్ కెవి

తన దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు సినిమాలో ఓ క్యారెక్టర్ చేశాడు అనుదీప్.

తాజా వార్తలు