డ్రగ్స్ కేసులోంచి తప్పించుకున్న క్రేజీ హీరో

తప్పు చేయడం కాదు తప్పు, దొరికిపోయేలా తప్పు చేయడం తప్పు.ఈ విషయం ఒక క్రేజీ హీరోకి వర్తిస్తుంది.

డ్రగ్స్ తీసుకుంటున్న టాలివుడ్ సెలబ్రిటిల మీద ప్రస్తుతం జరుగుతున్న విచారణ సంపూర్ణం కాదు అనే చెప్పాలి.ఎందుకంటే డ్రగ్స్ వాడుతున్న ప్రతి ఒక్కరు విచారణ లిస్టులోకి రాలేదు.

Tollywood Crazy Hero Cleverly Escapes From Drugs Case-Tollywood Crazy Hero Cleve

అంతేకాదు, డ్రగ్స్ అలవాటు లేని వారు విచారణ లిస్టులోకి వచ్చారు.సరే, డ్రగ్స్ వాడని వారు విచారణలో సాక్ష్యాలు ఇవ్వడానికి పనికివస్తారు కాని వారి ఇమేజ్ సంగతి ఏమిటి ? వారు డ్రగ్స్ తీసుకున్నా, తీసుకోకున్నా, అమ్మినా అమ్మకపోయినా, వారు పేరు అయితే లిస్టులో ఉంది.సామాన్య జనాలు వారి గురించి నెగెటివ్ గానే ఆలోచిస్తారు.

ఇదిలా ఉంటే, సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఒక క్రేజీ హీరో ఈ కేసులోంచి తప్పించుకోవడం ఇండస్ట్రీలో కొంతమందిని ఆశ్చర్యపరుస్తోంది.అందరికి తెలియకపోయినా, కొంతమంది సన్నిహితులకి తెలుసు అతను డ్రగ్స్ వాడుతాడని.

Advertisement

అతను మాత్రమే కాదు, అతని కుటుంబంలో కూడా డ్రగ్స్ వాడే వ్యక్తీ మరొకరు ఉన్నారు.వీరు ఎవరు అనేది సిట్ అధికారులకి తెలుసు అనుకుంటా .కాని విచారణకి ఎందుకు పిలవట్లేదు అంటే సాక్ష్యాలు లేక.వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకుండా ఎలా విచారిస్తారు ? ఆ హీరోకి ఎన్ని తెలివితేటలు అంటే, తన ఇమేజ్ ని, తన కుటుంబం యొక్క ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకున్నాడు.తానెప్పుడు ఒక డ్రగ్ డీలర్ ని కలిసింది లేదు, ఏ డ్రగ్ డీలర్ దగ్గర తన మొబైల్ నంబర్ ఉన్నది లేదు.

మిగితావారిలా నలుగురికి చెప్పుకోలేదు, పార్టీల్లో డ్రగ్స్ వాడలేదు.అంతా గోప్యమే.అందరికి తెలిసిన వారి దగ్గరి నుంచి డ్రగ్స్ తెప్పించుకోడు.

తనకు తప్ప ఎవరికీ తెలియని వారి దగ్గరి నుంచి ఇండైరేక్టుగా కొంటాడట.మరి ఆ సరుకుని మిగితావారిలాగా మరొకరికి అమ్మడు.

తానె ఉంచుకుంటాడు.ఈరకంగా చాలా గోప్యంగా చేయాల్సిన పనులు చేస్తూ, బయటకి గుడ్ బాయ్ ఇమేజ్ సంపాదించాడు.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
9 నెలల పసిగుడ్డును బలిగొన్న కూల్ డ్రింక్ మూత.. ఆదిలాబాద్‌లో విషాదం..

ఈ ఏడాది భారి హిట్ సాధించిన ఆ హీరో ఎవరో కనిపెట్టేందుకు ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు