పెద్ద సినిమాలకు ఈ చిన్న సినిమాలు పోటీ ఇచ్చేనా?

కరోనా కారణంగా కాస్త ఊపు తగ్గిన సినిమా పరిశ్రమ మళ్లీ జోరందుకుంటుంది.ప్రస్తుతం టాప్ హీరోలు నటించిన పలు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

ఇదే సమయంలో పలు చిన్న సినిమాలు కూడా జనాల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి.పెద్ద సినిమాలతో చిన్న సినిమాలు ఢీకొట్టబోతున్నాయి.

ఫిబ్రవరి 11న రవితేజ నటించిన ఖిలాడీ సినిమా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్ చేశాడు.

అటు ఈ సినిమాతో పోటీ పడేందుకు డిజె టిల్లు రెడీ అవుతోంది.

Advertisement

అటు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నాడు.మార్చి 4న మరో డేట్ ఫిక్స్ చేసినా.25కే జనాల ముందుకు వచ్చేఅవకాశం ఉంది.అదే రోజున శర్వానంద్ నటించిన ఆడవాళ్లూ మీకు జోహార్లు అనే సినిమా రిలీజ్ చేస్తున్నారు.

అటు ద్విభాషా చిత్ర సెబాస్టియన్ పిసి 524 అనే సినిమా కూడా విడుదల కాబోతుంది.అటు రవితేజ మరో మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ మార్చి 25న లేదంటే ఏప్రిల్ 25న కానీ రిలీజ్ చేయనున్నట్లు చెప్పింది.

మార్చి 25న ఆర్ఆర్ఆర్ రిలీజ్ అనౌన్స్ చేశారు.ఏప్రిల్ 29న ఆచార్య రిలీజ్ కు రెడీ అవుతుంది.దీంతో రవితేజ సినిమాకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

అటు ఆచార్య సినిమా ఏప్రిల్ 29న విడుదల అవుతుంది.మరోవైపు ఎఫ్ 3 సినిమా 28న రిలీజ్ కు సిద్ధం అవుతుంది.అయితే చిరంజీవి సినిమా ముందు ఈ సినిమా నిలబడుతుందా? అనేది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.వెంకటేష్, వరుణ్ తేజ్ లాంటి మల్టీస్టారర్ మూవీ అయినా.

కుమార్తె వ్యాఖ్యలు.. వేదికపై కంటతడి పెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!

మెగా సినిమా ముందు తట్టుకోవడం కష్టం అంటున్నారు.అయితే పెద్ద సినిమాలతో పోటీ పడుతున్న ఈ సినిమాలు ఎంత మేరకు జనాలను ఆకట్టుకుంటాయి? అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు