తల్లి కాబోతున్న మహేష్ హీరోయిన్...

టాలీవుడ్ లో మహేష్ బాబు నటించినటువంటి వన్ - నేనొక్కడినే చిత్రంలో మహేష్ బాబు సరసన ఆడిపాడినటువంటి ముద్దుగుమ్మ కృతి సనన్ గురించి తెలియని వారుండరు.

అయితే ఈ అమ్మడు టాలీవుడ్ లో వన్ చిత్రం తర్వాత అక్కినేని నాగచైతన్య సరసన దోచేయ్ అనే చిత్రంలో నటించింది.

అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు.దీంతో మళ్లీ ఈ అమ్మడు తన మకాం ని ముంబైకి మార్చింది.

అయితే అక్కడ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది.అయితే తాజాగా కృతి సనన్ కు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి.

ఇందులో ముఖ్యంగా కృతి సనన్ గర్భందాల్చిన ఫోటోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.అయితే ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహిస్తున్నటువంటి మిమి అనే చిత్రంలో నటిస్తోంది.

Advertisement
Tollywood Actress Kriti Sanon Pregnant Photos Viral On Social Media-తల్�

ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మిస్తున్నారు.అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం కృతి సనన్ గర్భం దాల్చినటువంటి కొన్ని సీన్లను చిత్రీకరిస్తున్నారు.

దీంతో అక్కడ పనిచేసే కొందరు వ్యక్తులు ఈ ఫోటోలను తీసుకొని నెట్లో అప్లోడ్ చేస్తున్నారు.దీంతో నెటిజన్లు ఈ ఫోటోలపై స్పందిస్తున్నారు.

ఇందులో భాగంగా అయ్యో అదేంటి గర్భం దాల్చిందా ? అసలింతకీ కృతిసనన్ కి ఏమైంది అంటూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

Tollywood Actress Kriti Sanon Pregnant Photos Viral On Social Media

అయితే ఇటీవల కాలంలో కృతి సనన్ హిందీలో నటించినటువంటి లుకా చుప్పి, హౌస్ ఫుల్ 4 వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకున్నాయి.అయితే ప్రస్తుతం కృతి సనన్ నటిస్తున్న టువంటి మిమి చిత్రం జూలై నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు