ప్రైవేట్ ఫైనాన్స్ పేరిట రూ.4 కోట్లకు టోకరా...!

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మండలం ( Choutuppal )పీపుల్ పహాడ్ గ్రామానికి చెందిన కామిశెట్టి పాండు ప్రైవేట్ ఫైనాన్స్( Kamishetti Pandu Private Finance ) పేరిట అధిక వడ్డీ ఆశ చూపి, గ్రామస్తులు, బంధువులు, తెలిసినవారు 70 మంది నుంచి,ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద రూ.50 వేల నుంచి రూ.

10,15 లక్షల వరకు సుమారు రూ.4 కోట్ల మేర డబ్బులు వసూలు చేసి పరారైన సంఘటన వెలుగులోకి వచ్చింది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.

పీపుల్ పహాడ్ గ్రామానికి చెందిన కామిశెట్టి పాండు గ్రామస్తులకు షూరిటీగా చెక్కులు,ప్రామిసరీ నోట్లు, కొంతమందికి ప్లాట్లు, భూములు రిజిస్ట్రేషన్ చేశాడు.ఇటీవల అప్పు ఇచ్చిన వారు మొత్తం డబ్బులు కావాలని అడగడం,ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర డబ్బులు వసూళ్లు చేసిన విషయం బయటకు పొక్కడంతో అందరూ ఒకేసారి డబ్బులు తిరిగి చెల్లించాలని పాండుపై ఒత్తిడి తేవడంతో 3 రోజులు నుంచి కనిపించకుండా పోయాడు.

దీంతో తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు.తమకు జరిగిన మోసంపైనేడు బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

నాకు తెల్వకుండనే నా భూమిని ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేసిండ్రు
Advertisement

Latest Video Uploads News