తిరుమలలో మరోసారి చిరుతల కలకలం

తిరుమలలో మరోసారి చిరుతపులి( Leopard ) సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.అలిపిరి నడక దారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

నడక దారి నుండి తిరుమల( Tirumala) కొండకు వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా అరవడంతో చిరుతలు అటవీలోకి పారిపోయాయని సమాచారం.రెండు చిరుతలు కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

భక్తుల ఫిర్యాదుతో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు.ఈ క్రమంలోనే కొండపైకి భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు.

మరోవైుప చిరుతల జాడన గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు