ఏపీలో పోలింగ్ నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనలపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ నేతలు సిట్ అధికారులను కలిశారు.
రాష్ట్రంలో అధికారులను మార్చిన ప్రాంతాల్లోనే అల్లర్లు జరిగాయని మంత్రి అంబటి పేర్కొన్నారు. టీడీపీ( TDP )తో కొంతమంది పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
సదరు ప్రాంతాల్లో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న మంత్రి అంబటి( Minister Ambati Rambabu ) అల్లర్ల ఘటనలపై పూర్తిగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.