మల్లారం సబ్ స్టేషన్ పై పిడుగు.. వేములవాడలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వేములవాడ రూరల్ మండలం మల్లారం సబ్ స్టేషన్ పై పిడుగు పడి దాని ద్వారా విద్యుత్ సరఫరా అయ్యే గ్రామాలు, పట్టణాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పట్టణ ఏఈ సిద్ధార్థ తెలిపారు.

భారీగా వర్షం కురుస్తున్నందున ఇతర సబ్ స్టేషన్ కు లింకు కలపాల్సి ఉందని కొద్దిగా సమయం పడుతుందని విద్యుత్ సరఫరాలో జరుగుతున్న అంతరాయానికి చింతిస్తున్నామని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Latest Rajanna Sircilla News