చాలా మంది విదేశీయులు భారతదేశాన్ని విజిట్ చేయడం కామన్.మన దేశ సంస్కృతి, ఆచారాలు వారికి ఎంతగానో నచ్చుతాయి.
ఇక్కడే శాశ్వతంగా ఉండాలనే కోరిక వారిలో పెరుగుతుంది.భారతీయ సంస్కృతి, భాష, జీవన విధానాన్ని ఒకసారి అర్థం చేసుకున్న వారు ఎక్కడికి వెళ్లినా దాన్ని మర్చిపోరు.
ఇలాంటి వారిలో ఒకరు భారతదేశం, హిందీ భాషలపై ఎంతగా ప్రేమ పెంచుకున్నారో ఈ రోజు మనం తెలుసుకుందాం.
జపాన్ దేశస్తుడైన కోకి శిషిడో( Koki Shishido ) అనే యువకుడు భారతదేశాన్ని చాలా ప్రేమిస్తాడు.ఎంతలా అంటే అతడు హిందీ భాషను( Hindi ) బాగా నేర్చుకున్నాడు కూడా.జపాన్‌లో ఉంటూ కూడా హిందీలోనే మాట్లాడతాడు.
తాజాగా తన అమ్మమ్మ ఇంటి గురించి( Grandmother Home ) హిందీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాడు.ఆ జపాన్ వ్యక్తి( Japanese ) అంత స్పష్టంగా హిందీ మాట్లాడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
అతను తరచుగా భారతదేశానికి వెళ్తూ ఉంటాడు.తన వీడియోల్లో భారతీయ సంస్కృతి గురించి చెబుతూ, హిందీలోనే మాట్లాడుతూ ఉంటాడు.
మన ఇండియన్ యూట్యూబర్లు తమ రోజువారీ జీవితం గురించి వీడియోలు చేసినట్లే, కోకి కూడా వీడియో చేశాడు.కానీ ఆయన వీడియోలో విశేషం ఏంటంటే, అంతా హిందీలోనే చెప్పడం.ఆయన తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడని, ఆ ఇల్లు 50 ఏళ్ల క్రితం కట్టించినదని చెప్పాడు.ఆ వీడియోలో ఆయన అమ్మమ్మ, వాళ్ళ కుక్క కూడా కనిపించాయి.
ఇల్లు చాలా అందంగా అలంకరించబడి ఉంది.ఆయన ఇంటిలోని గదులు, బాత్రూమ్‌లు అన్నీ చూపించాడు.
కోకి చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది.8 లక్షల మంది దాన్ని చూశారు.1.34 లక్షల మంది లైక్ చేశారు.వేల మంది నెటిజన్లు కోకిని ప్రశంసించారు.ఒకరు, “మీ అమ్మమ్మ చాలా అందంగా ఉంది! ఇల్లు కూడా అద్భుతంగా ఉంది” అని రాశారు.మరొకరు, “కోకి, లవ్ ఫ్రమ్ ఇండియా.గణపతి బప్పా మోరియా” అని రాశారు.
మరొకరు, “ఇల్లు చాలా అందంగా ఉంది కానీ మీ అమ్మమ్మ కన్నా అందంగా లేదు” అని రాశారు.