ఆ జిల్లా వాసులను వణికిస్తున్న పులి.. !

దేశంలోని ప్రజలను కరోనా భయపెడుతుంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అడవి జంతువులు భయం రోజు రోజుకు ఎక్కువ అవుతుందట.

ఇంట్లో నుండి కాలు భయటపెట్టాలన్న ఆలోచించవలసిన పరిస్దితులు తలెత్తుతున్నాయట.

ముఖ్యంగా అదిలాబాద్ జిల్లా వాసులకైతే ఈ కౄరజంతువుల భయం ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా కొమురం భీం జిల్లా వాసులను ఏ2 పులి హడలెత్తిస్తోందట.

Those Villages In Fear Of The Tiger Telangana, Komaram Bheem, Adilabad, Villages

పెంచికల్ పేట, బెజ్ఞూరు, దహేగం మండలాల్లో పులి స్వైర విహారం చేస్తోన్నట్లు సమాచారం.అదీగాక నందిగాం అటవీ ప్రాంతంలో పులి అడుగులను స్థానికులు గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతుందట.

ఈ పులి నందిగాం అటవీ ప్రాంతం నుండి దిగిడ వైపు వెళ్లినట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారట.దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

మొతానికి ఈ పులి సంచారంతో ఇక్కడున్న సుమారు 35 అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.ఒక్క ఈ గ్రామంలోనే కాదు.

తెలంగాణా రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో అడవి జంతువులు సంచరిస్తున్న విషయం తెలిసిందే.ఏది ఏమైన ప్రజల ప్రాణాలు కరోనా బారి నుండే కాదు కౄర జంతువుల నుండి కూడా కాపాడుకోవలసిన బాధ్యత వారిపైనే ఉంది.

Advertisement

తాజా వార్తలు