వేస‌విలో పొట్ట కొవ్వును క‌రిగించే బెస్ట్ స్మూతీ ఇది.. రోజూ తీసుకుంటే మ‌రిన్ని లాభాలు!

సాధారణంగా మనలో చాలా మందికి పొట్ట చుట్టూ కొవ్వు భారీగా పేరుకుపోయి ఉంటుంది.

నచ్చిన ఆహారం ఇష్టం వచ్చినట్లు తీసుకోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఒంటికి శ్రమ లేకపోవడం తదితర అంశాలు బెల్లీ ఫ్యాట్ కు కారణం అవుతాయి.

అయితే ఎక్కువ శాతం మంది ఈ సమస్యను పెద్దగా పట్టించుకోరు.కానీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల మధుమేహం, గుండె పోటు తో తదితర జబ్బులు వచ్చే ముప్పు పెరుగుతుంది.

అందుకే పొట్ట కొవ్వు( Belly fat)ను కరిగించుకోవడం చాలా అవసరమ‌ని నిపుణులు చెబుతున్నారు.అయితే బెల్లీ ఫ్యాట్ ను మాయం చేయడానికి కొన్ని ఆహారాలు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.

ఇప్పుడు చెప్పబోయే స్మూతీ కూడా ఆ కోవకే చెందుతుంది.అందులోనూ ప్రస్తుత సమ్మర్ లో ఈ స్మూతీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్ట కొవ్వు కరగడమే కాకుండా మరిన్ని ఆరోగ్య లాభాలు కూడా పొందుతారు.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి.

అలాగే ఐదు నుంచి ఆరు ఫ్రెష్ తులసి ఆకులు, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia Seeds), మూడు ఐస్ క్యూబ్స్ మరియు ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.తద్వారా మన వాటర్ మిలన్ స్మూతీ అనేది సిద్ధం అవుతుంది.ఎంతో రుచిక‌రంగా ఉండే ఈ స్మూతీలో కేల‌రీలు త‌క్కువ‌గా, పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి.

ఈ స్మూతీ ఆక‌లి కోరిక‌ల‌ను అరిక‌డుతుంది.జీవక్రియ రేటును పెంచుతుంది.

పొట్టు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును స‌మ‌ర్థ‌వంతంగా క‌రిగిస్తుంది.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 

అలాగే పుచ్చకాయ, కోకోన‌ట్ వాట‌ర్‌ హైడ్రేటింగ్ ల‌క్ష‌ణాల‌ను కలిగి ఉంటాయి.అందువ‌ల్ల ఈ స్మూతీని తీసుకుంటే వేస‌విలో డీహైడ్రేష‌న్ కు గురికాకుండా ఉంటారు.నీర‌సం ఎగిరిపోయి ఫుల్ ఎన‌ర్జిటిక్ గా మార‌తారు.

Advertisement

వేస‌వి వేడిని త‌ట్టుకునే సామ‌ర్థ్యం ల‌భిస్తుంది.పైగా ఈ స్మూతీలో వాడిన‌ తుల‌సి ఆకులు మ‌రియు చియా సీడ్స్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రిస్తాయి.

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను క‌రిగించి గుండెకు అండంగా నిల‌బ‌డ‌తాయి.

తాజా వార్తలు