మీ పిల్లలు హైట్ సరిగ్గా పెరగడం లేదా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి!

ఇటీవల రోజుల్లో చాలా మంది పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు ఉండడం లేదు.

సరైన ఎత్తు లేకపోవడం వల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది.

అందుకే తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు.ఎత్తు పెరగడం లేదనే కారణంతో తమ పిల్లలను తరచూ హాస్పిటల్స్ కి తిప్పుతూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే వర్రీ అవ్వడం మానేసి ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకోండి.పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు పెరగాలి అంటే మొదట వారి డైట్ పై దృష్టి సారించాలి.

ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లు, చికెన్, బీన్స్ ( Eggs, chicken, beans )వంటి ఆహారాలను వారి చేత తినిపించాలి.వారి డైట్ లో కూరగాయలు, ఆకుకూరలు, సీజనల్ పండ్లు( Vegetables, greens, seasonal fruits ) ఉండేలా చూసుకోవాలి.

Advertisement

అలాగే ఇప్పుడు చెప్పబోయే పొడి పిల్లల హైట్ ని పెంచడానికి ఉత్తమంగా సహాయపడుతుంది.

అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో అర కప్పు నువ్వులు( Sesame seeds ), ఒక కప్పు ఫూల్ మఖానా( fool makhana ), ఒక కప్పు బాదంపప్పు, రెండు టేబుల్ స్పూన్లు సోంపు విడివిడిగా వేయించుకోవాలి.ఇప్పుడు ఈ వేయించుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడిని కలిపి పిల్లల చేత తాగించాలి.నిత్యం ఈ పొడిని పాలలో కలిపి పిల్లలకు ఇస్తే వారి శారీరక మరియు మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది.

మంచిగా హైట్ పెరుగుతారు.ఎముకలు కండరాలు దృఢంగా సైతం మారతాయి.

నిజ్జర్ హత్య : ఆధారాలపై చేతులెత్తేసిన ట్రూడో .. భారత్‌దే విజయమన్న కెనడియన్ జర్నలిస్ట్
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచంటే ? 

ఇక పిల్లలను ఎప్పుడూ బుక్స్ కే పరిమితం చేయకుండా నిత్యం వారితో ఆటలు ఆడించండి.ఎక్సర్సైజ్ చేయించండి.వారి బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి.

Advertisement

ఎదుగుతున్న పిల్లలకు నిద్ర కూడా ఎంతో అవసరం.కాబట్టి స్క్రీన్ టైమ్ ను తగ్గించి స్లీప్ టైం ని పెంచండి.

అంతేకాకుండా రోజు ఉదయం సన్ రైస్ లో పిల్లల్లో కాసేపు ఉంచండి.తద్వారా విటమిన్ డి అందుతుంది.

పిల్లల హైట్ పెంచడానికి ఇది చాలా అవ‌స‌రం.

తాజా వార్తలు