ఈ న్యాచుర‌ల్ క్రీమ్‌ను రోజూ వాడితే స్కిన్ వైట్‌గా మెరిసిపోతుంద‌ట‌!

చ‌ర్మం తెల్ల‌గా మెరిసిపోవాల‌నే కోరిక అంద‌రికీ ఉంటుంది.

అందు కోస‌మే మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే స్కిన్ వైట‌నింగ్ క్రీముల‌ను ఎంతో ఖ‌ర్చు పెట్టి కొనుగోలు చేసి యూజ్ చేస్తుంటారు.

కానీ, ఇవి మంచి ఫ‌లితాన్ని ఇవ్వొచ్చు.ఇవ్వ‌క‌పోవ‌చ్చు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ క్రీమ్‌ను వాడితే గ‌నుక ఖ‌చ్చితంగా మీ స్కిన్ వైట్‌గా, కాంతి వంతంగా మారుతుంది.మ‌రి ఆ న్యాచుర‌ల్ క్రీమ్ ఏంటీ.? ఎలా త‌యారు చేసుకోవాలి.? అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల బియ్యం, ఒక క‌ప్పు రోజ్ వాట‌ర్ పోసి రెండు గంటల పాటు నాన బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత మిక్సీ జార్‌లో రోజ్ వాట‌ర్‌తో స‌హా బియ్యాన్ని మెత్త‌గా గ్రైండ్ చేసుకుని.వ‌డ‌బోసి పెట్టుకోవాలి.అలాగే ఒక క‌ప్పు కొబ్బ‌రి ముక్క‌ల‌ను కూడా తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి.

Advertisement
This Natural Cream Helps To Get Whitening Skin! Whitening Skin, Natural Cream, S

పాల‌ను వేరు చేసుకోవాలి.

This Natural Cream Helps To Get Whitening Skin Whitening Skin, Natural Cream, S

ఇప్పుడు స్ట‌వ్‌పై గిన్నె పెట్టుకుని అందులో బియ్యం వాట‌ర్‌, కొబ్బ‌రి పాలు పోసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.ఈ మిశ్ర‌మం ద‌గ్గ‌ర ప‌డ్డాక‌.స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఆపై ఇందులో మూడు విట‌మిన్ ఇ క్యాప్సుల్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటే క్రీమ్ రెడీ అయిన‌ట్టే.దీనిని ఒక గాజు డ‌బ్బాలో నింపుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

రాత్రి నిద్రించే ముందు ఈ న్యాచుర‌ల్ క్రీమ్‌ను అప్లై చేసుకుని.ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

ఇలా ప్ర‌తి రోజు చేస్తే స్కిన్ వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.ముడ‌త‌లు, మ‌చ్చ‌లు ఉంటే గ‌నుక త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

Advertisement

మ‌రియు క‌ళ్ల కింద ఏర్ప‌డిన న‌ల్ల‌టి వ‌ల‌యాల నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.

తాజా వార్తలు