ప్రస్తుతం నెట్టింట ఓ హార్ట్ టచింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది.
టర్కీలోని బెయిలిక్‌డుజు ఆల్ఫా వెటర్నరీ క్లినిక్‌లో(Beylikduzu Alfa Veterinary Clinic in Turkey) జనవరి 13న జరిగిన ఈ ఘటనలో ఓ తల్లి కుక్క (Mother Dog)తన స్పృహలేని పిల్లను నోట కరుచుకుని ఆసుపత్రికి వచ్చింది.
ఈ వీడియో చూసి నెటిజన్లు తమ గుండె తరుక్కుపోతుందని కామెంట్లు చేస్తున్నారు.వీడియోలో కనిపించినట్లు ఆ తల్లి కుక్క(Mother Dog) ఎవరి సహాయం కోసం ఆగలేదు.
తన కుక్కపిల్లను (Puppy)నోట్లో పెట్టుకుని నేరుగా వెటర్నరీ క్లినిక్(Veterinary clinic)తలుపుల వద్దకు వచ్చింది.పిల్ల పరిస్థితి ఎంత విషమంగా ఉందో గుర్తించిందేమో, అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తనే చొరవ తీసుకుంది.
దీంతో కుక్కకూనకు వెంటనే వైద్య సహాయం అందే అవకాశం దక్కింది.ఆ క్లినిక్‌లోని వెటర్నరీ డాక్టర్లు ఆ తల్లి కుక్క తెగువ చూసి ఆశ్చర్యపోయారు.
తలుపు దగ్గర కుక్కను గమనించిన వెంటనే సిబ్బంది ఒకరు తలుపు తెరిచారు.వెటర్నరీ డాక్టర్ బటురాల్ప్ డోగన్(Veterinary Doctor Baturalp Dogan) ఈ ఘటన గురించి వివరించారు.
వారి సహోద్యోగి ఎమిర్ మొదట ఆ తల్లి కుక్కను చూశారట.సాధారణంగా కుక్కలు అలా ప్రవర్తించడం అరుదు కాబట్టి, మొదట్లో ఎమిర్‌కు ఏం జరుగుతుందో అర్థం కాలేదట.
పిల్ల కుక్క కదలికలు లేకుండా, మంచులా చల్లగా ఉండటంతో అది చనిపోయి ఉంటుందని వారంతా భయపడ్డారు.
కానీ, ఆ పిల్లను పరీక్షించగా చాలా నెమ్మదిగా గుండె కొట్టుకోవడం గుర్తించారు.డోగన్ ప్రకారం, ఆ చప్పుడు ఎంత స్వల్పంగా ఉందంటే స్టెతస్కోప్‌తో కూడా వినిపించలేదట.చివరికి నీడిల్‌తో పరీక్షించగా, పిల్ల ఇంకా బతికే ఉందని తేలింది.
ఆ తల్లి చేసిన ప్రయత్నం వృథా పోలేదు.
చివరికి ఆ వెటర్నరీ డాక్టర్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ పిల్లను బతికించగలిగారు.ఇప్పుడు ఆ పిల్లకు స్పృహ వచ్చింది.తల్లి కుక్క, మరో తోబుట్టువుతో కలిసి క్లినిక్‌లోనే కోలుకుంటోంది.
మొత్తం ఆరు పిల్లలు పుట్టగా ఇవి మాత్రమే బతికాయి.ఆ తల్లి ప్రేమ, సంరక్షణ నిజంగా గ్రేట్ కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ ఘటన క్లినిక్ సిబ్బందినే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను కదిలించి వేసింది."ఇది కదా మాతృత్వం అంటే" అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy