సజ్జల భార్గవ్ విషయంలో తప్పుడు ప్రచారం.. వైరల్ అవుతున్న ఆ వార్తలు అవాస్తవాలే!

ఏపీ వైసీపీ( YCP ) సోషల్ మీడియా వ్యవహారాలకు సజ్జల భార్గవరెడ్డి ఇంఛార్జ్ గా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఆ వ్యవహారాలకు సజ్జల భార్గవరెడ్డి ( Sajjala Bhargava Reddy )దూరంగా ఉంటున్నారని నాగార్జున యాదవ్ కు ఆ బాధ్యతలను అప్పగించారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.

అయితే వైరల్ అవుతున్న వార్తలు అన్నీ అవాస్తవాలే అని ఆ వార్తల్లో అణువంతైనా నిజం లేదని క్లారిటీ వఛేసింది.నాగార్జున యాదవ్( Nagarjuna Yadav ) సోషల్ మీడియా వేదికగా స్పందించి ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చారు.

బలమైన ప్రజాపక్షంగా, నిర్మాణాత్మక మన సోషల్ విభాగ సైన్యం శ్రీ వైఎస్ జగన్ గారి మార్గదర్శకత్వంలో, శ్రీ సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో పభావశీల పంథాలో సాగుతోందని ఆయన తెలిపారు.నాకు వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో, వచ్చిన కథనాల్లో నిజం లేదని ఆయన తెలిపారు.

వైసీపీ వ్యతిరేక మీడియా చేసే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా సజ్జల భార్గవరెడ్డి కొనసాగనున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలకు సంబంధించి సజ్జల భార్గవ్ తన వంతు కష్టపడ్డారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సజ్జల భార్గవ్ గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారం విషయంలో వైసీపీ అభిమానులు సైతం ఫీలవుతున్నారు.

Advertisement

మరోవైపు మేనిఫెస్టో( Manifesto ) విషయంలో కొన్ని పొరపాట్ల వల్ల వైసీపీకి ఆశించిన ఫలితాలు రాలేదని అంతకు మించి మరే కారణం లేదని తెలుస్తోంది.వైసీపీ కొన్ని కొత్త హామీలను ప్రకటించి ఉంటే ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.జగన్ సైతం ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నేతలతో ముచ్చటిస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?
Advertisement

తాజా వార్తలు