ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో( Social Media ) అనేక రకాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవడం గమనిస్తూనే ఉన్నాం.అయితే సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి కొందరు పడరాని పాట్లు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో చాలామంది యువత రీల్స్ ( Reels ) చేసే సమయంలో హద్దులు మీరి ప్రయోగాలు చేస్తున్న సమయంలో చివరికి ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.ఇలాంటి సంఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి కూడా.
తాజాగా ఓ అమ్మాయి రీల్స్ కోసం ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండిగా మారింది.ఇక ఈ వైరల్ వీడియో గురించి పూర్తి వివరాలు చూస్తే.

ఓ యువతి ఎత్తైన బిల్డింగ్( Tall Building ) పైనుంచి కిందకు వేలాడింది.వీడియోలో చూపించినట్టుగా ఆ అమ్మాయి ఓ యువకుడి చేత పట్టుకొని ఎత్తైన బిల్డింగ్ పై వేలాడడం కనబడుతుంది.అలా చేస్తున్న సమయంలో వారి స్నేహితులు ఆ సంఘటనను వీడియో తీశారు.ఇలా చేస్తున్న సమయంలో జరగరాని పొరపాటు ఏదైనా జరిగిందా.ఆ అమ్మాయి కిందికి పడే లోపలే ప్రాణాలు పైకెళ్ళిపోతాయి.అయితే ఈ సంఘటన ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగిందో మాత్రం ఇంకా తెలియ రాలేదు.
ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ మారింది.ఈ వీడియో పై నెటిజన్లు తీవ్ర ఎత్తున ఆగ్రహానికి లోనవుతున్నారు.

ఈ వీడియో చూసిన చాలామంది నెటిజెన్లు ఆ అమ్మాయికి ఏమన్నా పిచ్చా.ఏదైనా పొరపాటు జరుగుతే ప్రాణాలు అమాంతం గాల్లో కలిసిపోతాయి అంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే ఇలాంటి పనికిమాలిన పనులు చేసేవారిని పోలీసులు వెంటనే శిక్షించాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే ఇలా చేసి ఏదైనా ప్రమాదం బారిన పడితే తల్లిదండ్రులకు ఎనలేని తిప్పలు తెచ్చి పెట్టడం అవసరమా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.







