డ్రై, డల్ & ఫ్రిజ్జీ హెయిర్‌ను స్మూత్‌గా, సిల్కీగా మార్చే సూప‌ర్ రెమెడీ ఇదే!

అస‌లే ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం న‌డుస్తోంది.ఈ సీజ‌న్‌లో ఆరోగ్య, చ‌ర్మ సమ‌స్య‌లే కాదు జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు సైతం తీవ్రంగా మ‌ద‌న పెడుతూనే ఉంటాయి.

ముఖ్యంగా జుట్టు త‌ర‌చూ వ‌ర్షాల్లో త‌డ‌వ‌టం వ‌ల్ల డ్రైగా, డ‌ల్‌గా మ‌రియు ఫ్రిజ్జీగా తయారువుతుంటుంది.దాంతో ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌టప‌డ‌టం కోసం మార్కెట్‌లో ల‌భించే ర‌క‌ర‌కాల ఉత్ప‌త్తుల‌ను వినియోగిస్తుంటారు.

అయితే వాటి కంటే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ న్యాచుర‌ల్ హోమ్ రెమెడీ మీ డ్రై, డల్ & ఫ్రిజ్జీ హెయిర్‌ను స్మూత్‌గా, సిల్కీగా మార్చ‌గ‌ల‌దు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్ని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల‌ గ్రీన్ టీ పౌడ‌ర్ వేసి.

Advertisement

బాగా మ‌రిగించాలి.ఆపై స్ట‌వ్ ఆఫ్ చేసి స్ట్రైన‌ర్ సాయంతో గ్రీన్ టీను ఫిల్ట‌ర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల క‌రివేపాకు పొడి, రెండు టేబుల్ స్పూన్ల‌ ఉసిరి కాయ పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ మందారం పువ్వుల పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి, రెండు టేబుల్ స్పూన్ల‌ అలోవెర జెల్‌, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఇక చివ‌రిగా ఇందులో ముందుగా త‌యారు చేసి పెట్టుకున్న గ్రీన్ టీని వేసి బాగా క‌లుపుకోవాలి.ఇలా క‌లుపుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని.ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.

గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

మ‌రియు త‌ర‌చూ ఈ రెమెడీని ప్ర‌య‌త్నిస్తే హెయిర్ ఫాల్ స‌మ‌స్యకు కూడా అడ్డుక‌ట్ట ప‌డుతుంది.

Advertisement

తాజా వార్తలు