జలుబును ఒక్కరోజులో తరిమికొట్టే సూపర్ రెమెడీ ఇది..!

జలుబు.‌‌.( Cold ) అత్యంత కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి.

ఎక్కువ శాతం మంది చలికాలం, వర్షాకాలంలోనే జలుబు వ‌ల్ల‌ ఎఫెక్ట్ అవుతుంటారు.

కానీ కొందరు మాత్రం సీజన్ తో సంబంధం లేకుండా తరచూ జలుబును ఫేస్ చేస్తుంటారు.చిన్న సమస్యే అయినప్పటికీ జలుబు వల్ల ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు.అయితే ఒక్కరోజులో జలుబును తరిమికొట్టే సూపర్ రెమెడీ ఉంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా అంగుళం పచ్చి పసుపు కొమ్మును( Turmeric ) తీసుకుని పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక ప‌సుపు తురుము వేసుకోవాలి.

Advertisement
This Is A Super Remedy To Get Rid Of Cold In One Day Details, Super Remedy, Cold

అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి( Pepper Powder ) వేసి ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టీ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి( Pure Ghee ) వేసి బాగా మిక్స్ చేసి గోరువెచ్చగా అయ్యాక సేవించాలి.

This Is A Super Remedy To Get Rid Of Cold In One Day Details, Super Remedy, Cold

ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా సహాయపడుతుంది.పచ్చి పసుపు, మిరియాలు మరియు నెయ్యిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తాయి.జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి వేగంగా రికవరీ అయ్యేందుకు తోడ్పడతాయి.

రోజుకు ఒక్కసారి ఈ డ్రింక్ ను తీసుకున్నారంటే జలుబు దెబ్బకు పరార్ అవుతుంది.

This Is A Super Remedy To Get Rid Of Cold In One Day Details, Super Remedy, Cold
అందరికి బతుకు పోరాటం అంత సులువుకాదు సుమా.. ఇతన్ని చూసి నేర్చుకోవాల్సిందే!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ డిసిజన్స్ మారిపోయాయా..?

అలాగే ఈ డ్రింక్ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.బాడీని డీటాక్స్ చేసి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.అలాగే నిత్యం కూడా ఈ డ్రింక్ ను తీసుకోవచ్చు.

Advertisement

ఈ డ్రింక్ వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

మరియు నిత్యం ఈ డ్రింక్ ను తాగడం వల్ల క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్కు తగ్గుతుంది.

తాజా వార్తలు