వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలకు చెక్ పెట్టాలనుకుంటున్నారా.. అందుకు ఇదే బెస్ట్ రెమెడీ!

సాధారణంగా ప్రతి ఒక్కరిలో వయసు పెరిగే కొద్దీ ఒంట్లో ఓపిక తగ్గుతుంది.అలాగే ముఖంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

ముఖ్యంగా వయసు పైబడిన ఛాయలు ముఖంలో స్పష్టంగా కనబడతాయి.అవే ముడతలు.

( Wrinkles ) అయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ ముడతలకు చెక్‌ పెట్టవచ్చు.వయసు పైబడిన కూడా యవ్వనంగా కనిపించవచ్చు.

మొదట ఆహారం విషయంలో జాగ్రత్త వ‌హించాలి.పోషకాలతో కూడిన ఫుడ్ ను డైట్ లో చేర్చుకోవాలి.

Advertisement
This Home Remedy Helps To Get Rid Of Wrinkles Naturally Details, Home Remedy, Wr

షుగర్, వేయించ ఆహారాలు, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.

సీజనల్ ఫ్రూట్స్, నట్స్ ను రెగ్యులర్ గా తినాలి.రసాయనాలతో కూడిన మేకప్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

ధూమపానం, మద్యపానం అలవాట్లు మానుకోవాలి.అలాగే కొందరు వేడి వేడి నీటితో స్నానం చేస్తుంటారు.

దీని కారణంగా కూడా చర్మం( Skin ) త్వరగా ముడతలు పడుతుంది.కాబట్టి గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఇక ముడతలకు చెక్ పెట్టడానికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ కూడా చాలా బాగా సహాయపడుతుంది.

This Home Remedy Helps To Get Rid Of Wrinkles Naturally Details, Home Remedy, Wr
Advertisement

అందుకోసం ముందుగా ఒక అరటి పండు( Banana ) తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ అరటి పండు ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు అరటిపండు ప్యూరీలో వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్,( Milk Powder ) వన్ టేబుల్ స్పూన్ హ‌నీ,( Honey ) వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు మూడు సార్లు ఈ రెమెడీని ఫాలో అయితే అద్భుత ఫలితాలు మీ సొంతం అవుతాయి.

ఈ రెమెడీ ముడతలను మాయం చేస్తుంది.సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.

ముఖ చర్మాన్ని యవ్వనంగా మెరిపిస్తుంది.

తాజా వార్తలు