స్పైడర్‌ మ్యాన్‌ అవతారం ఎత్తి బ్యాంక్‌ డ్యూటీ వెళ్లిన ఎంప్లాయ్‌.. ఎందుకు అలా చేశాడో తెలిస్తే అవాక్కవుతారు

పుర్రెకో బుద్ది అంటూ తెలుగులో సామెత ఉంది.అంటే ఒకొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారనేది ఆ సామెత అర్థం.

చిత్ర విచిత్రమైన మనుషులు ఈ భూమి మీద ఉన్నారు.ఆ చిత్రమైన మనుషులు చిత్ర విచిత్రమైన ఆలోచనలను కలిగి ఉంటారు.

ఉద్యోగం చేసే వద్ద హుందాగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు.హుందాగా ఉంటేనే ఆ ఉద్యోగం కొనసాగుతుంది.

కాని ఒక వ్యక్తికి మాత్రం స్పైడర్‌ మ్యాన్‌ కాస్ట్యూమ్స్‌లో ఒక్క రోజైనా జాబ్‌కు వెళ్లాలనేది కోరిక.

Advertisement
This Bank Employee Goes With Spiderman Getup For His Last Working Day-స్ప
This Bank Employee Goes With Spiderman Getup For His Last Working Day

కాని అలా వెళ్తే ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.అలా ఒత్తిడి భరించడంతో పాటు, బ్యాంకులోని ఇతర ఉద్యోగస్తుల నుండి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.తన కోరికను చాలా కాలం పాటు ఆ బ్యాంకు ఉద్యోగి అణచుకున్నాడు.

అయితే కొత్త జాబ్‌ రావడంతో పాత జాబ్‌కు అతడు గుడ్‌ బై చెప్పాడు.ఆ బ్యాంక్‌లో లాస్ట్‌ వర్కింగ్‌ డేను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నించాడు.

This Bank Employee Goes With Spiderman Getup For His Last Working Day

తన పాత ఉద్యోగం చివరి రోజును తాను అనుకన్నట్లుగా అంటే స్పైడర్‌ మ్యాన్‌ కాస్ట్యూమ్స్‌లో చేయాలని నిర్ణయించుకున్నాడు.అందకోసం ఎప్పుడో కొని పెట్టుకున్న తన స్పైడర్‌ మ్యాన్‌ కాస్ట్యూమ్స్‌ను ధరించాడు.అచ్చు గుద్దినట్లుగానే స్పైడర్‌ మ్యాన్‌గా ఉన్న ఆ వ్యక్తి బ్యాంకులోకి ఎంట్రీ ఇవ్వగానే అందరు కూడా నోరు వెళ్లబెట్టారు.

కొద్ది సేపటికి అందరికి కూడా అతడు తమ సహ ఉద్యోగి అని తెలిసింది.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
వైరల్ వీడియో : సీక్రెట్‌గా ప్రియురాలితో హొలీ ఆడాలని చూసిన ప్రియుడు.. చివరకు?

రోజంతా కూడా అతడు స్పైడర్‌ మ్యాన్‌ డ్రస్‌లోనే తన రెగ్యులర్‌ జాబ్‌ను చేశాడు.వచ్చిన కస్టమర్లకు కూడా సేవలు అలాగే అందించాడు.వచ్చిన వారిని సర్‌ప్రైజ్‌ చేయడంతో పాటు, ప్రతి ఒక్కరు కూడా అతడిని అభినందించేలా చేశాడు.

Advertisement

స్పైడర్‌ మ్యాన్‌ అంటే ఇంత ఇష్టం ఉన్న వ్యక్తి అంటూ అందరు కూడా అతడిని విచిత్రంగా చూశారు.బ్రెజిల్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ప్రపంచ మొత్తం వైరల్‌ అవుతోంది.

ఇష్టమైన పనిని ఏదో రకంగా చేయాలి.ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకుంటే జీవితాంతం కూడా బాధపడాల్సి వస్తుంది.

తాజా వార్తలు