అందానికి ఐస్ క్యూబ్స్.. ఇలా తయారు చేసుకుని వాడితే అదిరిపోయే బెనిఫిట్స్!

ముఖ చర్మం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని దాదాపు అందరూ కోరుకుంటారు.అందాన్ని పెంచుకునేందుకు క్రీములు నుంచి సీరమ్స్ వరకు రకరకాల చర్మ ఉత్పత్తుల్ని వాడుతుంటారు.

వారానికి మూడు నాలుగు సార్లు ఫేస్ ప్యాక్ లు మాస్కులు వేసుకుంటారు.అయితే అవే కాదు అందాన్ని పెంచడానికి ఐస్ క్యూబ్స్( Ice cubes ) కూడా ఎంతో బాగా సహాయపడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా ఐస్ క్యూబ్స్ తయారు చేసుకొని తరచూ వాడితే అదిరిపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.అందుకోసం ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి అరగంట పాటు వదిలేయాలి.

ఆ తర్వాత గ్రీన్ టీ( Green tea ) లో ఒక కప్పు రోజ్‌ వాటర్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ హనీ( Honey ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ లిక్విడ్ ను ఐస్ ట్రేలో నింపుకొని ఐదు నుంచి ఆరు గంటల పాటు రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి.

Advertisement

దాంతో ఐస్ క్యూబ్స్ తయారవుతాయి.ఈ ఐస్ క్యూబ్స్ ను రోజుకు రెండు చొప్పున తీసుకుని ముఖానికి మరియు మెడకు మసాజ్ చేసుకోవాలి.

పైన చెప్పిన విధంగా ఐస్ క్యూబ్స్ ను తయారు చేసుకుని చర్మానికి మసాజ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.వడదెబ్బ తగిలిన చర్మానికి ఉపశమనాన్ని అందించడానికి ఈ ఐస్ క్యూబ్‌లను ఉపయోగించవచ్చు.దీంతో ఎండకు కమిలి ఎర్రగా మారిన చర్మం తిరిగి పునరుత్తేజమవుతుంది.

అలాగే ఈ ఐస్ క్యూబ్స్ వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేయడంలో సహాయపడతాయి.ముడతలు, చర్మం సాగటం, చారలు వంటి వృద్ధాప్య లక్షణాలు మీ దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.అంతేకాదు గ్రీన్ టీ రోజ్ వాట‌ర్ తో ఐస్ క్యూబ్స్ ను తయారు చేసుకుని వాడితే మీ చర్మం తేమగా ఉంటుంది.

కాంతివంతంగా, అందంగా మెరుస్తుంది.జిడ్డు, డల్ నెస్ దూరం అవుతాయి.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

మొటిమలు, మొండి మచ్చలు వేధించకుండా ఉంటాయి.మరియు స్కిన్ ఎల్లప్పుడూ తాజాగా కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు