ఎముక‌లు దృఢంగా మారాలంటే ఏ ఏ పండ్లు తినాలో తెలుసా?

నిత్యం మ‌న ప‌నుల‌ను మ‌నం స‌జావుగా చేసుకోవాలంటే ఎముక‌లు దృఢంగా ఉండ‌టం ఎంతో అవ‌స‌రం.

నిల‌బ‌డాల‌న్నా, కూర్చోవాల‌న్నా ఏ ప‌ని చేయాల‌న్నా ఎముక‌లే ముఖ్య పాత్ర పోషిస్తాయి.

కానీ, ఇటీవ‌ల కాలంలో చాలా మంది ఎముక‌ల బ‌ల‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.ఎముక‌లు బ‌ల‌హీనంగా ఉంటే చిన్న చిన్న దెబ్బ‌ల‌కే చిట్ల‌డం, విర‌గ‌డం జ‌రుగుతుంటుంది.

అందుకే ఎముక‌ల‌ను బ‌లంగా మార్చుకోవ‌డం ఎంతో ముఖ్యం.అయితే కొన్ని కొన్ని పండ్ల ద్వారా ఎముక‌ల‌ను పుష్టిగా మార్చుకోవ‌చ్చు.

మ‌రి ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఎముక‌ల‌ను దృఢంగా మార్చ‌డంలో బొప్పాయి పండు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

బొప్పాయి పండ్లు రుచిగా ఉండ‌ట‌మే కాదు పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.ముఖ్యంగా ఎముక‌ల ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే కాల్షియం, మ్యాగ్నిషియం, విట‌మిన్ సి, విటమిన్ కె, బొప్పాయి పండులో పుష్క‌లంగా ఉంటాయి.

అందువ‌ల్ల త‌రచూ బొప్పాయి పండు తీసుకుంటే మంచిది.బొప్పాయి పండ్ల‌తో త‌యారు చేసిన జ్యూస్ కూడా తీసుకోవ‌చ్చు.

అలాగే పైనాపిల్ కూడా ఎముక‌ల‌కు ఎంతో మేలు చేస్తుంది.పైనాపిల్ జ్యూస్ లేదా డైరెక్ట్​ గా పైనాపిల్ తీసుకోవ‌డం చేస్తే ఎముక‌ల దృఢ‌త్వానికి ఉప‌యోగ‌ప‌డే పొటాషియం, క్యాల్షియం శ‌రీరానికి అందుతాయి.అయితే పైనాపిల్‌ను అధికంగా తీసుకోరాదు.

ఓవ‌ర్‌గా తీసుకుంటే శ‌రీర వేడికి దారి తీస్తుంది.మ‌రియు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

ఇక చూసేందుకు అందంగా, తినేందుకు రుచిగా ఉండే స్ట్రాబెర్రీలు కూడా ఎముక‌ల‌ను పుష్టిగా మార్చ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.రోజుకో స్ట్రాబెర్రీ పండు తీసుకుంటే అందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, విట‌మిన్ కె వల్ల ఎముక‌లు మ‌రియు కండ‌రాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.ఇక వీటితో పాటుగా యాపిల్ పండు, క‌మ‌లా పండు, కివి పండు వంటివి కూడా ఎముక‌ల ఆరోగ్యానికి ఎంతో మంచివి.

Advertisement

తాజా వార్తలు