ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎన్నో రకాల మొక్కలను ఇంటిలో పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పనిసరిగా మనీప్లాంట్ మనకు కనబడుతుంది.
ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఎంతో శుభసూచకమని ఈ ప్లాంట్ ఉండటం వల్ల ఏ విధమైనటు వంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని చాలా మంది భావిస్తారు.ఈ క్రమంలోనే మనీ ప్లాంట్ ప్రతి ఒక్కరూ నాటుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.
అయితే ఈ మనీ ప్లాంట్ ఎక్కడ పడితే అక్కడ నాటకూడదు.ఈ చెట్లు నాటే సమయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి.
మరి ఆ నియమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.మనీ ప్లాంట్ నాటేటప్పుడు చాలామంది కుండీలలో నాటుతారు.
నిజానికి మనీ ప్లాంట్ ఒక గాజు సీసాలో నాటడం ఎంతో మంచిది.వాస్తు శాస్త్రం ప్రకారం మనీప్లాంట్ ఆగ్నేయ దిశలో ఉండటం ఎంతో మంచిది.
ఇక ఈ చెట్టు పెరుగుతున్నకొద్దీ ఈ చెట్టును తాడు సహాయంతో పైకి వేలాడుతూ ఉండేలా చూసుకోవాలి.ఇలా ఉండటం ఎంతో మంచిది.
ఈ విధంగా మనీప్లాంట్ పాకుతూ వెళ్లడం వల్ల ఆ ఇంట్లో మనశ్శాంతి సంతోషం పుష్కలంగా లభిస్తాయి.
ఇక ఇంటి ఉత్తర ద్వారం వద్ద మనీ ప్లాంట్ ఉండటం వల్ల సరికొత్త ఆదాయ వనరులు వస్తాయి.ఇక ఈ చెట్టుని ఎప్పుడూ కూడా పొడిగా ఉండ నివ్వకూడదు.నిత్యం ఈ చెట్టుకు నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి.
ముఖ్యంగా ఇంటి ఆవరణంలో ఈ మొక్క ఎలాంటి పరిస్థితులలో ఉండ కూడదు.ఈ మొక్క ఎల్లప్పుడు ఇంటి లోపలే ఉండేలా చూసుకోవాలి .
అలాగే ఈ మొక్క పై ఇతరుల దృష్టి పడకుండా ఉండేలా చూసుకోవడం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటు వంటి ఆర్థిక సమస్యలు లేకుండా.ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy