క్రికెట్ అంటే గుర్తొచ్చేది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar ) పేరే.సచిన్ ను భారత్ లో క్రికెట్ దేవుడు గా పిలుస్తారు.
ఎందుకంటే సచిన్ అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టించాడు.ప్రపంచ కప్ సింగిల్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ సరికొత్త రికార్డు సృష్టించాడు.2003 వన్డే ప్రపంచ కప్ లో 11 మ్యాచులు ఆడి 673 పరుగులు చేశాడు.ఈ రికార్డ్ ను ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు.
ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్ మాథ్యూ హెడెన్ ( Matthew Hayden ) 11 మ్యాచ్లలో 659 పరుగులు చేసి ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు.
సచిన్ టెండుల్కర్ 1992 నుండి 2011 వరకు మొత్తం ఆరు ప్రపంచ కప్ లు ఆడాడు. ఈ కాలంలో 45 వన్డే మ్యాచ్లలో 2278 పరుగులు చేశాడు.సచిన్ టెండుల్కర్ రికార్డుకు దగ్గరగా ఎవరూ లేరు.
ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సచిన్ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ రీకి పాంటింగ్ 1743 పరుగులతో రెండో స్థానంలో, శ్రీలంక ప్లేయర్ కుమార సంగక్కర 1532 పరుగులతో మూడో స్థానంలో నిలిచారు.శ్రీలంక బ్యాటర్ కుమార సంగక్కర 2015 ప్రపంచ కప్ లో వరుసగా నాలుగు సెంచరీలు సాధించాడు.2019లో భారత జట్టు ప్లేయర్ రోహిత్ శర్మ మూడు సెంచరీలు చేశాడు.మరొక సెంచరీ చేసి ఉంటే కుమార సంగక్కర రికార్డు బ్రేక్ అయ్యేది.
2007లో వెస్టిండీస్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఒకే ఓవర్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్ హెర్సెల్ గిబ్స్( Hersel Gibbs ) వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు.ఈ రికార్డు ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు.శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ప్రపంచ కప్ లో వరుసగా నాలుగు బంతులు నాలుగు వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.ఈ రికార్డు ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు.