ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కు మార్గదర్శకాలు ఇవే

టిడిపి ,జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించాయి.

అధికారంలోకి రాగానే ఆ పథకాలను అమలు చేస్తామనే హామీని ఇచ్చాయి.

ఇప్పుడు ఆ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాయి.దీనిలో భాగంగానే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఈ దీపావళి నుంచి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేశారు.ఏటా మూడు సిలిండర్లు అందించేలా క్యాలెండర్ ను నిర్ణయించారు.

అలాగే తెల్ల రేషన్ కార్డు( White ration card ) ప్రామాణికంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చే ఈ పథకం కోసం ప్రభుత్వం పైన ఏటా దాదాపు 2684 కోట్ల భారం పడనున్నట్లు అంచనా వేస్తున్నారు .

These Are The Guidelines For Booking Free Gas Cylinders In Ap, Tdp Janasena, Bjp
Advertisement
These Are The Guidelines For Booking Free Gas Cylinders In AP, TDP Janasena, BJP

 ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ పథకం అమలు చేయనున్నారు.ఈ పథకం అమలు కోసం ఈనెల 27 లేదా 28వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభించనున్నారు.గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం అమలవుతుందని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ( AP Minister Nadendla Manohar)ప్రకటించారు.

ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని , ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ ఇచ్చే విధంగా షెడ్యూల్ ను ఖరారు చేశారు.ఏప్రిల్ ,జూలై మధ్య మొదటి సిలిండర్,  ఆగస్టు నవంబర్ మధ్య రెండో సిలిండర్,  డిసెంబర్ మార్చి 31 మధ్య మూడో సిలిండర్ ను  ఇవ్వనున్నట్లు మంత్రి నాదెండ్ల ప్రకటించారు.

లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ సొమ్ములు 48 గంటల్లో జమ చేయనున్నారు.

These Are The Guidelines For Booking Free Gas Cylinders In Ap, Tdp Janasena, Bjp

తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమల్లో భాగంగా వీటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే దానిపైన చర్చించారు. పింఛన్లు ఇంటింటికి వెళ్లి ఇస్తున్నట్లే సిలిండర్లను అందిస్తే బాగుంటుందనే ప్రతిపాదన వచ్చింది .లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో కంటే ఇంటికి వెళ్లి ఇస్తే ఎక్కువ ప్రభావం ఉంటుందని కొంతమంది మంత్రులు సూచించారు.అయితే తనకు అలాంటి ఆలోచన ఉందని ,కానీ ఐదు రాష్ట్రాలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాయని , ప్రస్తుతానికి ఆ విధానాన్ని పాటిద్దాం అన సీఎం చంద్రబాబు చెప్పారట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు