Soybean : సోయా బీన్ చిక్కుడు సాగులో అధిక దిగుబడులు ఇచ్చే మేలు రకం విత్తనాలు ఇవే..!

రైతులు ఏ పంటలు సాగుచేసిన అధిక దిగుబడులు( High yields ) సాధించాలంటే నేల, ఎరువులతో పాటు విత్తనాలు అత్యంత కీలకము.

మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

సోయాబీన్ చిక్కుడు( Soybean ) సాగులో సరైన మెళుకువలు, విత్తనాల ఎంపికలు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.జె.ఎస్335 రకం ఈ రకం విత్తనాలను సాగు చేస్తే, పంట 90 రోజులకు చేతికి వస్తుంది.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 10 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.

ఈ రకానికి చెందిన గింజ మద్యస్థంగా ఉంటుంది.ఈ రకం మొవ్వ కుళ్ళు తెగులను తట్టుకొని మంచి దిగుబడి ఇస్తుంది.

ఎల్.ఎల్.బి.1 రకం:

ఈ రకం విత్తనాలను సాగు చేస్తే, 65 రోజులకే పంట చేతికి వస్తుంది.ఒక ఎకరం పొలంలో 6 క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుంది.

Advertisement

ఈ రకానికి చెందిన మొక్కలు పొట్టిగా ఉంటాయి.పత్తి, కంది( Cotton ) లాంటి పంటలలో ఈ రకాన్ని అంతర పంటగా సాగు చేయవచ్చు.

పి.కె1029 రకం:

ఈ రకం విత్తనాలను సాగు చేస్తే పంట 100 నుండి 110 రోజులలో చేతికి వస్తుంది.ఒక ఎకరం పొలంలో 8 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.

ఈ రకం త్రుప్పు తెగులను తట్టుకోగలదు.

జె.యస్ 93-05 రకం:

ఈ రకం విత్తనాలను సాగు చేస్తే పంట 90 రోజులకు చేతికి వస్తుంది.ఒక ఎకరంలో ఏడు క్వింటాళ్లకు పైగా దిగుబడి పొందవచ్చు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
సినిమాల విషయంలో దూకుడు పెంచుతున్న బాలయ్య...కారణం ఏంటి..?

యల్.యన్.బి.18 రకం:

ఈ రకం విత్తనాలను సాగు చేస్తే పంట 110 రోజులకు చేతికి వస్తుంది.ఒక ఎకరం పొలంలో 12 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.

Advertisement

ఈ రకం ఆకు మచ్చ, తుప్పు తెగుళ్ళను, మొజాయిక్ తెగులను తట్టుకోగలుగుతుంది.

తాజా వార్తలు