ఈ సిజన్‌లో పెట్టుకోవాల్సిన ఇండోర్‌ ప్లాంట్స్‌ ఇవే!

ఇది వర్షాకాలం చుట్టూ గ్రీనరీతో ఎంతో అందంగా ఉండే కాలం.పచ్చని చెట్లు ఇది మీ మనసుకుం కూడా ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది.

బయటే కాదు ఇంట్లో కూడా పెట్టుకోవాల్సిన చెట్లు ఉంటాయి.రకరకాల తీగజాతి మొక్కలను పెట్టుకోవాచ్చు.

వీటితో ఇంట్లో ఉండే కార్బన్‌ డై ఆక్సైడ్‌ను బయటకు పంపించి ఆక్సిజన్‌ లెవల్స్‌ను పెరుగుతుంది.కరోనా నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది ఇంట్లో మొక్కలను పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే! ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో ఆక్సిజన్‌ లెవల్‌ను పెంచే మొక్కలను పెట్టుకుంటున్నారు.

ఎలాంటి మొక్కలు మన ఇంటికి ఎయిర్‌ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తాయో తెలుసుకుందాం.

రబ్బర్‌ ప్లాంట్‌

మీ లివింగ్‌ రూంలో ఈ రబ్బర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

Advertisement

లేదా స్టడీ రూంలో పెట్టుకున్నా సరిపోతుంది.దీనికి అతి తక్కువ కేర్‌ అవసరం.

దీనికి సూర్యకాంతి నేరుగా పడకుండా ఉండాలి.వీటికి అందిచాల్సిన నీరు, మెయింటెనెన్స్‌ పెద్ద పనుండదు.

ప్రతిమూడు రోజులకు ఒకసారి సరిపోయినంత నీరు పోస్తే సరి.అదే చాలా చక్కగా పెరుగుతుంది.ఇది మంచి ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ మొక్క.

స్ట్రింగ్‌ ఆఫ్‌ పర్ల్‌

ఇది చాలా అందమైన మొక్క.దీన్ని హ్యాంగింగ్‌ పాట్‌లో ఏర్పాటు చేసుకుంటే, వీటి కొమ్మలు జారుతూ చాలా అందంగా కనిపిస్తుంది.దీనికి ప్రతిరోజూ నీరు పోయాల్సి ఉంటుంది.

పీస్‌ లిల్లీ

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

పీస్‌ లిల్లీని చాలా సులభంగా పెంచుకోవచ్చు.దీనికి ఓ మోస్తారు ఎండ ఉంటే సరిపోతుంది.ఈ మొక్కకు నీరు పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత నీరు పోయాల్సి ఉంటుంది.

Advertisement

ఇది పెద్దగా లష్‌గా కనిపించే మోడ్రన్‌ మొక్క.

స్వీట్‌హార్ట్‌ ప్లాంట్‌

ఈ ప్లాంట్‌ ఆకులు హార్ట్‌ ఆకారంలో ఉంటుంది.అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది.

దీనికి కూడా అంత కేర్‌ అవసరం ఉండదు.దీనికి డైరెక్ట్‌ సూర్యాకాంతి అవసరం.

కిటికీ ప్రాంతాంల్లో లేదా లివింగ్‌ రూంలోని టేబుల్‌ పై సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా ఏర్పాటు చేసుకోవచ్చు.

బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌

ఇది నేరుగా సూర్యకాంతి పడే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవచ్చు.తక్కువ సన్‌లైట్‌లో కూడా పెరుగుతుంది.ఈ మొక్కను కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఈ మొక్కకు మంచి సాయిల్‌తోపాటు ఫర్టిలైజర్‌ కూడా అందించాల్సి ఉంటుంది.దీనికి ఇంకా ఇతర మెయింటెనెన్స్‌ అవసరం లేకుండానే చక్కగా పెరుగుతుంది.

ఎయిర్‌ ప్లాంట్‌

ఇది ఎక్కడైనా సులభంగా పెరుగుతుంది.దీనికి తక్కువ కేర్‌ అవసరం.ఈ మొక్కల్లో ఇంకా వెరైటీ లు కూడా ఉంటాయి.

వారానికి ఒకసారి ఈ మొక్కను నీటిలో నానపెట్టాలి.ఇది మంచి ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ ప్లాంట్‌.

ఈ ప్లాంట్‌ను హ్యాంగ్‌ చేయవచ్చు.

తాజా వార్తలు