ప్రగతిలో ఉన్న పనులను మిషన్ మోడ్ లో పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రగతిలో ఉన్న రోడ్డు , మన ఊరు మనబడి , రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులను మిషన్ మోడ్ లో పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

సోమవారం అభివృద్ధి పనుల పురోగతి పై సంబంధిత శాఖల అధికారుల తో జిల్లా కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు.

త్వరితగతిన పూర్తి కి దిశా నిర్దేశం చేశారు.జిల్లాలో ఆర్ అండ్ బి చేపట్టిన 19 రోడ్డు రెన్యువల్ పనుల్లో 14 పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయనీ.

మిగతా పనులను నెల రోజుల్లో గా పూర్తి చేయాలన్నారు.వేములవాడ లో మూలవాగు పై నిర్మాణంలో ఉన్న వంతెన పనులకు సంబంధించి ఇప్పటికే రెండు స్లాబ్ లు పూర్తి అయినందున మిగతా పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.

సిరిసిల్ల రెండు బై పాస్ పనులకు సంబంధించి పెండింగ్ పనులను తుది లేయర్ , డివైడర్ అభివృద్ధి, ప్లాంటేషన్, లైటింగ్ పనులు సహా అన్ని పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులను పూర్తి క్వాలిటీ తో దసరా లోగా పూర్తి చేయాలన్నారు.

Advertisement

త్వరితగతిన పనుల పూర్తికి గానూ నెల వారిగా టార్గెట్ కాంట్రాక్టర్ కు ఇవ్వాలన్నారు.ఫారెస్ట్ అనుమతులు అవసరం అయిన మానాల - మర్రి మడ్ల, చందుర్తీ - మోతుకు రావు పేట , జిల్లెళ్ల - ముస్తాబాద్ రోడ్డు పనులకు సంబంధించి నాన్ - ఫారెస్ట్ స్థలంలో వేగంగా పని పూర్తి చేయాలన్నారు.

అటవీ శాఖ కు సంబంధించి స్టేజ్ -1,2 అనుమతులు సాధ్యమైనంత త్వరగా పొందేందుకు కృషి చేయాలన్నారు.జిల్లాలో ప్రగతిలో ఉన్న రెండు పడక గదుల ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

గ్రామ సభలో చర్చించి ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను అత్యంత పారదర్శకంగా కేటాయించాలని చెప్పారు.మన ఊరు మనబడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులు పాఠశాలలు పున ప్రారంభం అయ్యే పూర్తి చేయాలన్నారు.

వీటిడిఏఅభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.జిల్లా కేంద్రంలో కేటాయించిన ఎకరం స్థలంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం కు వెంటనే రివైజ్డ్ టెండర్ లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆర్ అండ్ బి అధికారులను చెప్పారు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లలో బ్లాక్ స్పాట్ ( ప్రమాదకర) లను గుర్తించి హెచ్చరిక బోర్డ్ లను ఏర్పాటు చేయాలన్నారు .ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్ , ఆర్డీఓ టి శ్రీనివాసరావు, జిల్లా అటవీ అధికారి బాలమని , ఆర్ అండ్ బి ee శ్యామ్ సుందర్, పి ఆర్ ఈ ఈ సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News