వైర‌ల్‌.. ఇది సినిమా కాదండోయ్‌.. స్టూడెంట్ల కొట్లాట‌..

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఎలాంటి వీడియోలు వైర‌ల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.

కొన్ని వీడియోలు చూస్తే ఇది సినిమాలో జ‌రిగిన వీడియోనా లేదంటే నిజంగానే జ‌రిగందా అనే అనుమానాలు రాక మాన‌వేమో.

కాగా యూత్‌లో చాలామంది సినిమాల‌ను ఆద‌ర్శంగా చేసుకుని సేమ్ టు సేమ్ అలాగే చేసేందుకు రెడీ అవుతున్నారు.ఇందులో ఎక్కువ‌గా గొడ‌వ‌లు ప‌డేందుకు మాత్రం సినిమాల‌నే ఇన్ స్పిరేష‌న్‌గా తీసుకుంటున్నారు.

కాగా ఇప్పుడు కూడా ఇలాంటి ఓ రియ‌ల్ ఫైట్ గురించి చెప్పుకోబుతున్నాం.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చూడ‌టానికి సినిమాల్లో లాగా ఫైట్ అనిపించినా ఇది మాత్రం రియ‌ల్ ఫైటే.కొంద‌రు స్టూడెంట్లు ఒక‌రిపై ఒక‌రు ఓ రేంజ్‌లో కొట్లాట‌ చేసుకున్న ఘ‌ట‌న ఇప్పుడు కేరళలోని కోజికోడ్ లో జ‌రిగింది.

Advertisement

ఈ ఏరియాలో ఉన్న ఓ స్కూల్‌కు చెందిన స్టూడెంట్లు మధ్య రాజుకున్న వివాదం కాస్తా ఇప్పుడు పెద్ద రచ్చగా మారిపోయంది.అస‌లు ఏం జ‌రిగిందంటే కోజికోడ్ లోని కొడవల్లి ప్రాంతం ద‌గ్గ‌ర ఉండే స్కూల్ స్టూడెంట్ల‌కు హయ్యర్ సెకండరీ స్కూల్ స్టూడెంట్ల‌కు అలాగే కొడువల్లి హెచ్‌ఎస్ స్కూల్ స్టూడెంట్లకు న‌డుమ చిన్న వివాదం త‌లెత్తింది.

ఆ చిన్న స‌మ‌స్య కాస్త ఆపెద్ద‌దిగా మారి చివ‌ర‌కు ఇరు స్కూళ్ల స్టూడెంట్ల న‌డుమ పెద్ద ఎత్తున గొడ‌వ‌కు దారి తీసింది.దీంతో ఇరు స్కూళ్ల టీచ‌ర్లు, మేనేజ్ మెంట్లు రంగంలోకి దిగి దీన్ని పెద్ద‌ది కాకుండా చూసేందుకు రెడీ అయిపోయారు.ఎగ్జామ్స్‌కు ముందు ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా ఉండాల‌ని అంద‌రూ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించినా కూడా చివ‌ర‌కు అది స‌క్సెస్ కాలేదు.

ఇంకేముంది స్టూడెంట్లు అంద‌రూ క‌లిసి ఘర్షణ చేసేందుకు ఎగ్జామ్ అయిపోయిన త‌ర్వాత కాచుకుని కూర్చున్నారు.ఇక అటు నుంచి రెండో వ‌ర్గం వారు రాగానే దాడులు మొద‌ల‌య్యాయి.

ఇక పోలీసులు వ‌చ్చి వీరి గొడ‌వ‌ను శాంతింప‌జేశారు.

కుంభమేళాలో విషాదం.. ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రాణాలు వదిలిన పోలీస్..!
Advertisement

తాజా వార్తలు