ఈ తెలుగు పాట కుదించడానికి 5 రోజులు పట్టింది .కానీ తీసాక ఏం జరిగిందో తెలుసా.. ?

జ‌గ‌దేక‌వీరుని క‌థ. 1961లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది.

కెవి రెడ్డి దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రఖ్యాత నటుడు నందమూరి తారకక రామారావు హీరోగా నటించాడు.ఈ సినిమాలోని శివ‌శంక‌రీ శివానంద‌ల‌హ‌రి అనే పాట అప్పట్లో అద్భుతమైన పాపులారిటీ సాధించింది.

ఇప్పటీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకుంది.పలువురు గాయకులూ ఇప్పుడు సైతం ఆ పాటను గుర్తుకు చేసుకుంటారు.

పలు స్టేజి షోలలో ఆలపిస్తారు కూడా.మొత్తంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఈ పాట ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

Advertisement

ఈ సినిమాలో ఈ పాటను పెట్టడాని ఓ కారణం ఉంది.దీని కంటే ముందే జ‌గ‌దేక‌వీరుని క‌థ‌ సినిమాలోని మిగ‌తా పాట‌ల రికార్డింగ్‌ అయిపోయింది.

వాటి పిక్చ‌రైజేష‌న్ కూడా కంప్లీట్ చేశారు.క్లైమాక్స్ షూటింగ్‌కు మరో రెండు నెలల టైం మాత్రమే ఉంది.

ఈ సమయంలో డైరెక్ట‌ర్ కెవి రెడ్డి మ్యూజిక్ డైరెక్ట‌ర్ పెండ్యాల నాగేశ్వ‌ర‌రావుతో ఓ విషయాన్ని చెప్పాడు.ఈ పాట గురించి వివరించాడు.

ఈ పాట సినిమాకు గుండెలాంటిది అని వెల్లడించాడు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
ఆ విషయంలో చిరంజీవి బాలకృష్ణ సేమ్ టూ సేమ్.. బాబీ కామెంట్స్ వైరల్!

అంతేకాదు.ఈ సినిమాకు మూల కారణం అయిన తమిళ మూవీ జ‌గ‌ద‌ల ప్‌ంతాప‌న్‌ ను ఓసారి పరిశీలించాలని చెప్పాడు.అయితే అసలు సినిమా చూస్తే.

Advertisement

దాని ప్రభావం ఈ సినిమా మీద పడుతుందని పెండ్యాల ఆ పని చేయలేదు.ఆ తర్వాత పాట రచయిత పింగళి నాగేంద్ర రారు ఈ పాట పల్లవి రాసి వినిపించాడు.

దర్శకుడు కెవి రెడ్డికి నచ్చింది.ఓకే చెప్పాడు.

ఈ పాట అంతటిని రాసి.15 రోజుల పాటు కష్టపడి బాణీలు కట్టాడు పెండ్యాల.పాట రెడీ అయినట్లు చెప్పాడు.

ఓ రోజు అందరూ కూర్చుని పాట విన్నారు.అద్భుతంగా ఉందన్నారు.

అయితే పాట లెన్త్ చాలా ఉన్నందున్న సగానికి తగ్గించాలని చెప్పాడు కెవి రెడ్డి.నాలుగైదు రోజుల కష్టపడి కుదించాడు పెండ్యాల.ఈ పాటకు దర్శకుడు ఓకే చెప్పాడు.

ఈ పాట అద్భుతంగా తెరకెక్కించారు.తెలుగు సినిమా ప్రపంచంలో అద్భుత జనాదరణ పొందింది ఈ పాట.

తాజా వార్తలు