తెర్లుమద్ది మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి..చైర్మన్ చొప్పరి రామ చంద్రం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో మోత్కుల చెరువు లో సుమారు 5 వేల చేప పిల్లలు మృతి చెందడం తో తెర్లుమద్ది గ్రామ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారని ,వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని జిల్లా మత్స్యశాఖ చైర్మన్ చొప్పరి రామచంద్రము ప్రభుత్వం కు విజ్ఞప్తి చేసారు.

మంగళవారం జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ ఆదేశాలతో ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ స్పెషల్ ఆఫీసర్ వంశీకృష్ణ ఎంపీటీసీ సంఘటన స్థలాన్ని చేరుకొని చెరువును పరిశీలించారు.

ఈ సందర్భంగా మత్స్యశాఖ చైర్మన్ చొప్పరి రామచంద్రం మాట్లాడుతూ తెర్లు మద్ది మత్య పారిశ్రామిక సహకార సంఘం ఆర్థికంగా నష్టపోయారని, చెరువులో ఎవరైనా విష ప్రయోగం చేశారా లేక ఏవైనా కలుషిత నీరు చేరి చేపలు మృత్యువాత పడ్డాయా అనే విషయం అధికారుల విచారణ బయటపడే అవకాశం ఉంటుందని తెలిపారు.సంఘమును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాంగోపాల్ తేర్లుమద్ది మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు ఈర్ల పరుశురాములు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాజమల్లయ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News