ప్రపంచంలోనే అతి చిన్న ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ( Electric vehicles )వినియోగం విస్తృతంగా పెరుగుతోంది.

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వాహనాలను విడుదల చేస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థ Fiat సరికొత్తగా ప్రపంచంలోనే అతి చిన్న ఎలక్ట్రిక్ కారును తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది.Fiat Topolino EV కారు పొడవు కేవలం 2.53 మీటర్లు మాత్రమే ఉంటుంది.

ఈ కారు బుకింగ్స్ ఇటలీలో ( Italy )ఇప్పటికే ప్రారంభమయ్యాయి.ఇటలీలో ఈ కారు విక్రయాలు ప్రారంభం అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ కారును అందుబాటులోకి రానుంది.భారత మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో.

అసలు వస్తుందా రాదా అనే దానిపై స్పష్టత లేదు.ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే.

Advertisement

కంపాక్ట్ డిజైన్ తో వస్తుంది.ఈ కారు గరిష్ట వేగం 45 కిలోమీటర్లు.ఈ కారు 5.5kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్( Lithium ion battery pack ) తో వస్తుంది.ఈ కారును ఒక్కసారి చార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

ఈ కారు గ్లాస్ రూఫ్, కాన్వాస్ రూఫ్ అనే రెండు వేర్వేరు రూఫ్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.ఈ కారు డోర్లు నాన్ డోర్ ఎంపికతో లభిస్తాయి.

ఈ కారుకు క్రోమ్ కోటింగ్ తో కూడిన అద్దాలు, USB, బ్లూటూత్ స్పీకర్, ప్రీమియం సీట్ కవర్ తో వస్తుంది.ఇక ఈ కారు ధర విషయానికి వస్తే 8065 యూఎస్ డాలర్లు.మన భారత కరెన్సీలో దాదాపుగా రూ.6.70 లక్షలు.కస్టమర్లను ఆకర్షించడం కోసం కంపెనీ ఈఎంఐ ఆప్షన్ లో ఈ కారును అందుబాటులోకి తెచ్చింది.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు