ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ చేయడంలో కార్యదర్శి నిర్లక్ష్యం..!

నల్లగొండ జిల్లా:త్రిపురారం మండలం దొంగతండ గ్రామపంచాయతీలో గతవారం రోజుల క్రితం దరఖాస్తు చేసిన ప్రజాపాలన( Praja palana ) దరఖాస్తులను ఆన్లైన్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ కార్యదర్శి( Village Secretary )ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఎంపిడిఓ విజయ్ కుమారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీ పథకాలకు( 6 guarantee schemes ) అర్హత కలిగిన 200 మంది దరఖాస్తు చేసినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని,ఎన్ని సార్లు కార్యదర్శిని అడిగినా సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారని,అనుమానమొచ్చి పైఅధికారులను అడగగా అవి ఇంకా ఆన్లైన్ కాలేదని,అందుకే మీకు ఎలాంటి లబ్ధి రావట్లేదని చెప్పడంతో కార్యదర్శి నిర్లక్ష్యం బయటపడిందన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తులసిరామ్, రంగా,లాల,రంగ తదితరులు పాల్గొన్నారు.

చామలేడు కార్యదర్శిపై ఎంపిడిఓకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

Latest Nalgonda News