సాధారణంగా కొందరు వేసే ఐడియాలు అందరినీ షాక్ కు గురి చేస్తాయి.ఒకింత సర్ ప్రైజ్ చేస్తాయనే చెప్పొచ్చు.
నిజానికి అలాంటి ఐడియాలు వేయడం అంటే ఎవరికి పడితే వారికి సాధ్యం కాదనే చెప్పాలి.ఇలాంటి క్రేజీ ఐడియాలతో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్న వారు కూడా ఉన్నారు.
అంతెందుకు మొన్నటికి మొన్న హైదరాబాద్ లో నల్లగుట్ట డ్యాన్సర్ శరత్ ఒక చిన్న యాడ్ ను పాటగా మార్చేసి ఎంత పాపులర్ అయిపోయాడో అందరికీ తెలిసిందే.అయితే ఇప్పుడు కూడా ఓ వ్యక్తి ఫేమస్ అయ్యేందుకు చేయకపోయినా అతను చేసిన పనిమాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.
సాధారణంగా మనకు రద్దీగా ఉన్న ట్రైన్‌లో సీటు దొరకడం అంటే చాలా కష్టమైన పనే.ముందుగా జాగ్రత్త పడితే గానీ సీటు దొరకదు.
ఒకవేళ సీటు దొరక్క పోతే మాత్రం గమ్యం చేరే దాకా నరకం చూడాల్సి వస్తుంది.అలా కాదని నిలబడి ఉంటే మాత్రం కాళ్లు పీక్కు పోతాయి.
కానీ ఉపాయం ఉండాలే గాని అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నాడు ఓ వ్యక్తి.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఓ ట్రైన్ లో ఓ వ్యక్తి సీటు కోసం తెగ వెతికేశాడు.అయినా నిరాశే మిగిలింది.
అలా అని నిల్చోడానికి ఇష్టపడలేదు.ఓ క్రేజీ ఐడియా వేసి అందరినీ షాక్ కు గురి చేశాడు.ట్రైన్ లో ఉండే రెండు సీట్ల నడుమ అంటే మనుషులు నడిచే దారిలో ఉయ్యాల లాంటిది కొంత ఎత్తులో కట్టుకున్నాడు.ఇక అందులో హాయిగా కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు.
అతను అందరిలా మొహమాట పడుకుండా ఎవరేమనుకుంటే నాకేంటి అన్న కోణంలో ఐడియా వేసి సూపర్ అనిపించుకున్నాడు.ఇక దీన్ని కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా అందరూ అతని ఐడియాకు ఫిదా అయిపోతున్నారు.
ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయంటూ కామెంట్లు పెడుతున్నారు.