ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన ను తక్షణమే రద్దు చేయాలి:- విద్యార్థి సంఘాలు డిమాండ్

ఇంటర్ పరీక్షల కు హాజరయ్యే విద్యార్థులకు నిమిషం నిబంధన అమలులో ఉండటంతో ఈ రోజు ఖమ్మం నగరంలోని ఆర్ జె సి కళాశాల సెంటర్ లో భూక్య దేవి అనే విద్యార్థిని, పరీక్షకు కేవలం పది నిమిషాలు లేటుగా హాజరు కావడంతో పరీక్షకు అనుమతించని దౌర్భాగ్య పరిస్థితి నేడు జిల్లాలో కనిపిస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే నిమిషం నిబంధన రద్దు చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా PDSU-AISF-SFI జిల్లా కార్యదర్శి లు వెంకటేష్,రామకృష్ణా,ప్రవీణ్ లు మాట్లాడుతూ విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించకుండా నిమిషం నిబంధన పెట్టడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని వారు అన్నారు.విద్యార్థులకు సరేనా రవాణా సౌకర్యం కల్పించకుండా నిమిషం నిబంధన దేనికని, గ్రామానికి బస్సులు రాకపోవడం వల్ల పాలేరు నియోజకవర్గం నుండి ఖమ్మం నగరానికి సరైన రవాణా శాఖ సౌకర్యం లేకపోవడం వల్ల సమయానికి హాజరు కాలేకపోయినా విద్యార్థుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు.

ప్రభుత్వం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వ అధికారులు, రవాణా సౌకర్యం ఏర్పాటు చేయకుండా విద్యార్థులను హింసించడం సరైన పద్ధతి కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే నిమిషం నిబంధన ఎత్తివేయాలని మరియు విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా వెనుకాడబోమని వారన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులుSFI జిల్లా అధ్యక్షుడు మధు, PDSU-AISF- నాయకులు, సతీష్,కరుణ్.తరుణ్, తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
జనసేన వైపే వారందరి చూపు .. ఎందుకిలా ?

Latest Khammam News