బలం పెంచుకునేందుకు సిద్ధమైన జనసేన ! పది రోజులపాటు ఆ ప్రక్రియ 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన,  బిజెపి ( TDP, Jana Sena, BJP )పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే .

ఈ విజయంలో జనసేన కీలక పాత్ర పోషించిందని, జనసేన లేకపోతే తమకు ఈ స్థాయిలో విజయం దక్కి ఉండేది కాదని , స్వయంగా టిడిపి అదినేత చంద్రబాబు( Chandrababu ) ప్రకటించారు.

ఇక జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించిన 21 అసెంబ్లీ , రెండు  పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జనసేనకు ఉత్సాహాన్ని కలిగించాయి.ప్రభుత్వంలోనూ కీలక భాగస్వామ్యంగా ఉండడం,  ప్రాధాన్యం ఉన్న పదవులను తీసుకోవడంతో జనసేన ప్రభావం మరింతగా పెరిగింది.

ఈ క్రేజ్ మరింతగా పెంచుకునేందుకు జనసేన సిద్ధమవుతోంది.ఈ మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదుకు సిద్ధమవుతోంది .

ఈనెల 18 నుంచి క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం ఉంటుందని ,10 రోజుల పాటు ఈ నాలుగో విడత సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని జనసేన పార్టీ ప్రకటించింది .ఒక్కో నియోజకవర్గంలో 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపింది.పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు పని చేయాలని, సమిష్టిగా పనిచేద్దామంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై నాయకులతో టెలికాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ( Minister Nadendla Manohar )వివరించారు.

Advertisement

పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు మనమంతా ఉన్నామని భరోసాను క్రియాశీలక సభ్యత్వం ఇస్తుందని నాదెండ్ల అన్నారు గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో జాతీయస్థాయిలో చర్చించుకునేలా పార్టీ విజయం సాధించడానికి అంత కష్టపడ్డామని నాదెండ్ల అన్నారు.

1000 మంది క్రియాశీలక సభ్యులతో మొదలైన పార్టీ ప్రస్థానం నేడు 6.47 లక్షల మందికి చేరింది.  ఈనెల 18 మించి సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

ఈ కార్యక్రమంలో తొమ్మిది లక్షల సభ్యత్వాల నమోదు చేయాలని టార్గెట్ ను పెట్టారు.  క్రమక్రమంగా ఏపీలో సొంతంగా బలం పెంచుకునే విధంగా జనసేన ఫోకస్ చేస్తోంది.

మీడియా రంగంలోకి రాబోతున్న నాగబాబు.. ఇక జన సేనకు తిరుగుండదు?
Advertisement

తాజా వార్తలు