కార్గిల్‌ విజయ్ దివస్‌ నిర్వహణకు భారత సైన్యం సిద్ధం

23వ ‘కార్గిల్‌ విజయ్ దివస్‌’ కార్యక్రమాల నిర్వహణకు భారత సైన్యం సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా కార్గిల్‌ యుద్ధవీరుల త్యాగాలను గుర్తుచేసుకోనున్నారు.

ప్రధాన కార్యక్రమాన్ని లద్ధాఖ్‌ ద్రాస్‌ సెక్టార్ లోని ‘కార్గిల్ యుద్ధ స్మారకం‌’ వద్ద.జులై 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు శ్రీనగర్‌లోని సైనిక ప్రజాసంబంధాల అధికారి కర్నల్ ఎమ్రాన్ ముసావి తెలిపారు.

సైనికుల త్యాగాలను గుర్తు చేస్తూ పర్వతారోహకురాలు, పద్మభూషణ్‌ గ్రహీత బచేంద్రి పాల్ నేతృత్వంలో 50 ఏళ్లు పైబడిన 12 మంది మహిళలు అయిదు నెలలపాటు సుదీర్ఘ హిమాలయాల యాత్రను సాగిస్తున్నారు.విజయ్‌ దివస్‌లో భాగంగా ‘ఫిట్‌ 50 ప్లస్‌’ పేరిట ఈ యాత్రను చేపట్టారు.

అయిదు నెలల క్రితం అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాంగ్-సౌ పాస్ వద్ద ఈ యాత్ర ప్రారంభమైంది.బచేంద్రి పాల్ నేతృత్వంలోని ఈ బృందం ఇప్పటికే హిమాలయాల వెంబడి 37 పర్వత మార్గాలను దాటి.4 వేల 977 కిలోమీటర్లకుపైగా ప్రయాణించింది.గురువారం లమయూరు ప్రాంతానికి చేరుకుంది.

Advertisement

‘ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్‌’ పరిధిలోని కార్గిల్ మీదుగా సాగి 24న ద్రాస్‌లో ఈ యాత్ర ముగియనున్నది.శారీరక, మానసిక దృఢత్వానికి.

వయస్సుతోపాటు ఆడామగా తేడాలు అడ్డంకులు కారాదనే సందేశాన్ని ఈ యాత్ర ద్వారా చాటి చెబుతున్నారని కర్నల్‌ ముసావి తెలిపారు.బచేంద్రి పాల్ బృంద సభ్యులను జులై 25న ఓ కార్యక్రమంలో సత్కరించనున్నట్లు ఆయన తెలిపారు.

మరోవైపు.‘ఫరెవర్ ఇన్ ఆపరేషన్ డివిజన్’కు చెందిన 18 మంది ఆర్మీ సిబ్బంది ఈ నెల 20న ‘విక్టరీ మోటార్‌ సైకిల్ ర్యాలీ’ ప్రారంభించారు.లేహ్‌ జిల్లాలోని తుర్తుక్‌ నుంచి బయలుదేరిన ఈ బృందం.

జులై 26న ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌ వద్దకు చేరుకోనున్నది.లద్ధాఖ్‌లో ఉద్రిక్త ప్రాంతంగా భావించే భూభాగం గుండా 481 కిలోమీటర్లమేర ఈ ర్యాలీ సాగనున్నది.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??

ఏటా జులై 26న ‘విజయ్‌ దివస్‌’ జరుపుకుంటున్నాం.ఆ యుద్ధంలో భారత్‌ వైపు 527మంది యోధులు ప్రాణాలు కోల్పోగా.

Advertisement

పాక్‌ వైపు మరణాల సంఖ్య 4000 వరకు ఉండవచ్చునని అంచనా.

తాజా వార్తలు