నిజామాబాద్ ఇద్దరు చిన్నారుల మృతి కేసు ఛేదన

నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఇద్దరు చిన్నారుల మృతి కేసును పోలీసులు ఛేదించారు.పిల్లలను కన్నతల్లి అరుణే దారుణంగా హత్య చేసిందని పోలీసులు నిర్ధారించారు.

చిన్నారుల మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల నుంచి వివరాలు సేకరించారు.నిజామాబాద్ నుంచి అరుణ తన ఇద్దరు పిల్లలతో కలిసి బాన్సువాడ వచ్చిందని తెలిపారు.

అనంతరం చిన్నారులను తానే హత్య చేసి ఆటో డ్రైవర్ పిల్లలను కెనాల్ లో పడేశారని కట్టుకథ అల్లిందని వెల్లడించారు.కుటుంబ తగాదాల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు.

భర్త ఫిర్యాదుతో అరుణపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు