నేను సినిమాలకు దూరంగా ఉండడానికి అదే కారణం.. నటుడు శివాజీ కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనంతరం హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ( Shivaji ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన శివాజీ అనంతరం హీరోగా అవకాశాలను అందుకున్నారు.

ఇక ఈయన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈయన రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఇలా రాజకీయాలలో కొనసాగుతూ కొన్నిసార్లు ఈయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

ఇన్ని రోజులపాటు సోషల్ మీడియా ( Social media )కు కూడా దూరంగా ఉన్నటువంటి శివాజీ గత కొద్ది రోజుల నుంచి వరుస ఇంటర్వ్యూలకు హాజరవ్వడమే కాకుండా సినిమాల గురించి రాజకీయాల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శివాజీ ఇన్ని రోజులు తాను ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి గల కారణాలను తెలియజేశారు.అలాగే కెరియర్ మొదట్లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా తెలియజేశారు.

Advertisement

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ గతంలో ఓ ప్రముఖ నటుడు తండ్రి మరణిస్తే ఆయనను పరామర్శించడానికి వెళ్ళాను.

పరామర్శించడానికి వెళ్లి తనని హగ్ చేసుకోవడానికి వెళ్ళగా తాను నా చేతులను తీసేశారు.హోదా ఉన్నప్పుడే అలా హత్తుకోవాలని నాకు ఆ క్షణం అర్థమైందని తెలిపారు.అలాగే మరొక పెద్ద ఆర్టిస్టుతో కలిసి తాను సినిమా చేశాను ఆయన నా రెమ్యూనరేషన్( Remuneration ) అడిగారు మనవాళ్లే కదా అని రెమ్యూనరేషన్ చెప్పడంతో ప్రొడ్యూసర్ వద్దకు వెళ్లి అందరికన్నా తనకి ఎక్కువ ఇస్తున్నారనీ మాట్లాడారు.

నేను సంపాదించుకుంటుంటే చూసి ఆ వ్యక్తి ఓర్చుకోలేకపోయారని ఈ సందర్భంగా శివాజీ తెలిపారు.ఇక ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం అవకాశాలు రాకపోవడమే అయితే అవకాశాలు వచ్చి కథ డిమాండ్ చేస్తే తాను నెగిటివ్ పాత్రలలో అయినా నటించడానికి సిద్ధంగానే ఉన్నాను అంటూ ఈ సందర్భంగా శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు