కథ వినకుండానే హాయ్ నాన్న సినిమాని రిజెక్ట్ చేసిన హీరో.. ఇప్పుడు బాధపడి లాభమేంటి?

నూతన దర్శకుడు శౌర్యువ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం హాయ్ నాన్న ( Hai Naana ) ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని నాని( Nani ), మృణాల్ ( Mrunal ) హీరోయిన్లుగా నటించారు.

ఇక ఈ సినిమా మొదటి షో నుంచి కూడా ఎంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాలో నాని నటించిన తర్వాత నాని మినహాయి సినిమాలోని పాత్రకు ఎవరు సూట్ అవ్వరు అనిపించేలా నాని నటించారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో( Social media ) వైరల్ గా మారింది.ఈ సినిమాకు ముందుగా దర్శకుడు హీరోగా నానిని ఎంపిక చేయలేదట .డైరెక్టర్ శౌర్యువ్ సోదరుడు నిఖిల్ విజయేంద్ర సింహ నిహారిక మంచి స్నేహితుడు కావడంతో శౌర్యువ్ ముందుగా ఈ సినిమా కథను మెగా హీరో వరుణ్ తేజ్ ( Varun Tej ) కు వినిపించాలని కోరుకున్నారట ఈ క్రమంలోనే కథతో వరుణ్ ఇంటికి శౌర్యువ్ వెళ్లగా ఈ హీరో కనీసం కథ కూడా వినకుండా ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

ఇలా వరుణ్ తేజ్ ఈ సినిమా కథను రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం నాచురల్ స్టార్ నానికి వచ్చిందని చెప్పాలి అయితే వరుణ్ తేజ్ ( Varun Tej ) ఈ సినిమాని రిజెక్ట్ చేయడానికి కారణం లేకపోలేదు అప్పటికే ఈయనకు లావణ్య( Lavanya ) తో పెళ్లి కూడా ఫిక్స్ కావడంతో ఈ సినిమా షూటింగ్లో తాను పాల్గొనలేనని తప్పకుండా పెళ్లి సమయానికి ఈ సినిమా తనకు ఇబ్బందిగా మారుతుందన్న ఉద్దేశంతోనే వరుణ్ తేజ్ ఈ సినిమా కథ కూడా వినకుండానే రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.ఒకవేళ వరుణ్ తేజ్ కనుక ఈ సినిమాలో నటించి ఉంటే ఆయన ఖాతాలో మంచి హిట్ సినిమా పడి ఉండేదని కానీ వ్యక్తిగత కారణాలవల్ల ఇలాంటి మంచి సినిమాని రిజెక్ట్ చేసుకున్నారని చెప్పాలి.

Advertisement
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

తాజా వార్తలు