ఆ ఇల్లంతా తెలుపు, ఎరుపే.. ఎక్కడో తెలుసా..?!

సాధారణంగా ప్రతి మనిషికి ఫేవరెట్ కలర్ ఉంటుంది.కొందరికి ఎరుపు ఇష్టం ఉంటుంది కొందరికి తెలుపు ఇష్టం ఉంటుంది.

కొందరికి ఆకుపచ్చ, మరి కొందరికి పసుపు పచ్చ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ అంటే ఇష్టం ఉంటుంది.అయితే తమకు ఇష్టమైన కలరు రంగు వస్త్రాలను ధరించడానికి కొంతమంది ఇష్టపడుతుంటారు.

తమ వస్తువులను కూడా తమకు ఇష్టమైన కలర్ లో ఉండేటట్టు చూసుకుంటారు.అయితే, బెంగళూరులో నివసిస్తున్న సేవన్‌రాజ్‌ అనే 58 ఏళ్ల వ్యక్తికి తెలుపు, ఎరుపు అంటే బాగా ఇష్టం.

తాను ధరించే వస్త్రాలు మాత్రమే కాదు తాను మొహం కడుక్కునే బ్రష్ కూడా తెలుపు, ఎరుపు రంగులోనే ఉండేటట్టు చూసుకుంటారు.ఇంట్లో ప్రతి వస్తువు కూడా ఎరుపు, తెలుపు రంగులోనే ఉంటుంది.

Advertisement

ఆయన ఒక్కరే కాదు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎరుపు, తెలుపు కాంబినేషన్ లో ఉన్న వస్తువులను యూస్ చేస్తారు.వాళ్ళు కూడా ఎరుపు, తెలుపు కలరు గల దుస్తులను మాత్రమే ధరిస్తారు.

నిజానికి ప్రతి ఒక్కటీ ఎరుపు, తెలుపు రంగులోనే ఉంటాయ్.వారి ఇంటి లోపలకు వెళ్లి చూస్తే కర్టెన్లు, మొబైల్స్, గోడలు, కార్లు, కార్యాలయాలు, అద్దాలు, బూట్లు-సాక్సులు, మరుగుదొడ్లు, దంతాల బ్రష్‌లే కాకుండా ధరించే డ్రెస్సులు కూడా ఎరుపు, తెలుపు రంగులలోనే కనిపిస్తాయి.

సేవన్‌రాజ్‌ భార్య పుష్ప తన భర్త ఇష్టాన్ని కాదనలేక ఎరుపు తెలుపు రంగులో ఉన్న వస్తువులు మాత్రమే కొనుగోలు చేసింది.భార్య మాత్రమే కాదు సేవన్ రాజు కొడుకు భరతరాజ్, కూతురు మనీషా కూడా ఎరుపు మరియు తెలుపు రంగు దుస్తులనే ధరిస్తారు.

నిజానికి సేవన్‌రాజ్‌ చిన్నతనంలో ఎక్కువగా ఎరుపు తెలుపు వస్త్రాలను ధరించేవారు.అయితే ఇతని డ్రెస్ ను చూసి చాలామంది ఇట్టే గుర్తుపట్టే వారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

దీంతో సేవన్‌రాజ్‌ ఎరుపు మరియు తెలుపు రంగు వస్త్రాలను ధరించడం అలవాటు చేసుకున్నారు.కాలక్రమేణా తనకు ఎరుపు మరియు తెలుపు రంగు లపై మహా ఇష్టం కలిగింది.

Advertisement

అందుకే ప్రస్తుతం ఆయన తన ఇంట్లో వస్తువులతో పాటు తన ఒంటి పై అన్ని ఎరుపు మరియు తెలుపు రంగు వస్తువులు, వస్త్రాలు ఉండేలాగా చూసుకుంటున్నారు.ఇతనికి 7 అనే సంఖ్య కూడా బాగా ఇష్టం.

ఏడు సంఖ్యను అదృష్టంగా భావిస్తున్న ఇతను తన వస్త్రాలపై 7 సంఖ్యను ముద్రించారు.

తాజా వార్తలు