ఆ దర్శకుడు నిర్మాత ఫోటో షూట్ కి పిలిచి దారుణంగా మోసం చేశారు.. నా జీవితంలో పెద్ద మచ్చ: జయవాణి

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీమణులకు ఇండస్ట్రీలో ఎదురయ్యే చేదు అనుభవాల గురించి అందరికీ తెలిసిందే.

ఎందుకంటే ప్రతి ఒక్కరూ తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల, ఇతర వేధింపుల గురించి  మీడియా ముందు చాలాసార్లు బయటపెట్టారు.

ఇండస్ట్రీలో తాము మరింత హోదాతో కొనసాగాలంటే పక్క దర్శక నిర్మాతలతో సంబంధం పెట్టుకోవాల్సిందే.ఇప్పటికే ఇటువంటివి ఎంతో మంది హీరోయిన్ లు ఎదుర్కొన్నారు.

ఇది కేవలం సినీ రంగంలోనే కాదు.మహిళలు చేసే  ప్రతి ఒక రంగంలో ఇలాంటివి చాలా ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఒకప్పటి నటి జయవాణి కూడా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బయట పెట్టింది.ఇంతకు తను ఏం చెప్పిందో ఓ సారి తెలుసుకుందాం.

Advertisement

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయవాణి.వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా నటించింది.

ఈమె అసలు పేరు ఉమామహేశ్వరి.ఇండస్ట్రీకి అడుగుపెట్టాక జయవాణిగా పేరు అందుకుంది.తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

నటిగానే కాకుండా నృత్య కారిణిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మొదటిసారిగా సినీ ఇండస్ట్రీకి ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్డు అనే సినిమాతో పరిచయం అయింది.ఆ తర్వాత అదిరిందయ్యా చంద్రం, మా ఆయన సుందరయ్య, ప్రియదర్శిని, అల్లరి రాముడు దాదాపు 34 సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.గత ఏడాది ఉల్లాల ఉల్లాల సినిమాలో నటించింది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

ఇక ఈమె కెరీర్ మొదట్లో రండి లక్షాధికారి కండి అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది.ఆ తర్వాత పలు సీరియల్ లలో కూడా నటించింది.

Advertisement

ఈమె ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న సినిమా విక్రమార్కుడు. 2006లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ, అనుష్క నటీ నటులు నటించారు.

ఈ సినిమాలో జయవాణి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.దీంతో ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.ఇదిలా ఉంటే గతంలో ఈమె కూడా ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో పాల్గొని అందులో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి పంచుకుంది.తను అనుకున్న లక్ష్యానికి తాను చేరుకోలేదని ఇంకా తను చేరుకోవాల్సి ఉందని తెలిపింది.

అంటే తను ఎక్కువ కష్టపడలేదని తెలిపింది.తనకు ఇతరుల సపోర్ట్ ఉంటే బాగుండేదని తెలిపింది.

ఇక తనకు ఒక సినిమా అని చెప్పి ఓ దర్శకుడు ఫోన్ చేశాడట.దాంతో ఆ దర్శకుడు, నిర్మాత ఆ సినిమాకు కావాల్సిన ఒక గెటప్ లో తన డ్రెస్సింగ్ గురించి తనను పిలిచారట.

అలా తనను ఒక డ్రెస్ వేసుకోమని.అది సెట్ అవుతుందో లేదో చూసుకోమని అన్నారట.దాంతో తాను వేసుకోవడంతో కొన్ని ఫోటో షూట్ లు చేశారట.

ఆ తర్వాత వాళ్లు ఎక్కడా కనిపించలేదని కేవలం తన ఫోటోలను మాత్రం దింపి మోసం చేసి వెబ్ సైట్ లో పెట్టారని తెలిపింది.ఇక వెబ్ సైట్ లో ఆ ఫోటోలు పెట్టిన వ్యక్తి ఎవరో కూడా తెలియదని.

కనీసం ఆ డైరెక్టర్, నిర్మాతల ఫోన్ నెంబర్లు కూడా తీసుకోలేదని తెలిపింది.ఆ ఫోటోలతో తనకు ఇప్పుడు కూడా ఒక మచ్చలాగా అనిపిస్తుందని తెలిపింది.

తాజా వార్తలు