పోలీసుల ప్రాణాలను బలిగొన్న లారీ డ్రైవర్ నిద్ర మత్తు.. !

ఊపిరి పోయడం కష్టం గానీ ప్రాణాలు తీయడం అంత కష్టం కాదని పలు సంఘటనలు నిరూపిస్తున్నాయి.

విధానం ఏదైతే నేమి ఇప్పుడున్న కాలంలో మనిషి ప్రాణం అంటే చిత్తు కాగితాన్ని చింపినంత సులువుగా మారిపోయింది.

దీనికి తోడు తెలిసి చేస్తున్న తప్పు, నిర్లక్ష్యం.ముఖ్యంగా ప్రయాణాల సమయంలో ఎందరి ప్రాణాలో ఊహించని విధంగా పోతున్నా గానీ మార్పు కలగడం లేదు.

Two Police Killed In Lorry Accident, East Godavari, Samarthkota, Undur, Road Acc

ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఉండూరు వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు మృత్యువాత పడ్దారు.కాగా విజయవాడ నుంచి వచ్చే కరోనా వ్యాక్సిన్‌ వాహనానికి ఎస్కార్ట్ విధుల నిర్వహణలో భాగంగా ఉండూరు వంతెన వద్ద వేచి ఉండగా వేగంగా వచ్చిన లారీ వీరి పైకి దూసుకెళ్లగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం.

అయితే లారీ డ్రైవర్ మితి మీరిన వేగం, అందులో నిద్ర మత్తు కారనంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఇకపోతే మృతిచెందిన పోలీసులను తిమ్మాపురం పోలీసు స్టేషన్‌ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మెండి సత్యనారాయణ, హోం గార్డు ఎన్.ఎస్‌.రెడ్డిగా గుర్తించారు.

Advertisement
ఇది కదరా క్రేజ్ అంటే.. పాకిస్థాన్ బైకులపై '18 విరాట్' (వీడియో)

తాజా వార్తలు