హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ లోని గాంధీభవన్ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లు రాని నేతల అనుచరులు ఆందోళనకు దిగారు.

తమ నేతలకు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కార్యకర్తలు, అనుచరులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నారాయణఖేడ్, వనపర్తి, పటాన్ చెరుతో పాటు మహబూబాబాద్ కు చెందిన కార్యకర్తలు గాంధీభవన్ కు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ఫెయిల్ అయిన సర్కస్ స్టంట్.. భయంకర బైక్ యాక్సిడెంట్ వైరల్..?
Advertisement

తాజా వార్తలు