ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై ఇంకా అనేక విషయాలపై చర్చించిన అనంతరం .
రేపటితో అనగా 9 వ తారీకు నాడు ముగుస్తున్న నేపథ్యంలో .మరో పది రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.అదే రీతిలో మినహాయింపు టైమింగ్స్ విషయంలో కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది.

ఈ నెల పదవ తారీకు నుండి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.అదే రీతిలో ట్రాఫిక్ నేపథ్యంలో ఆరు గంటల లోపు ఇంటికి చేరుకోవాలని క్యాబినెట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఆ తర్వాత రోడ్డుమీద కనబడితే కఠిన చర్యలు ఉంటాయని .క్యాబినెట్ స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి.
నకిరేకల్ అదే రీతిలో నల్గొండ జిల్లా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అవుతాయి అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
.