జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు లేనంత పొలిటికల్ స్పీడ్ ను ఇప్పుడు చూపిస్తున్నారు.ఆషామాషీగా రాజకీయాలు చేస్తే పూర్తిగా వెనుకబడిపోవాల్సి ఉంటుందని, భవిష్యత్తులో ను అధికారంలోకి వచ్చే అవకాశమే ఉండదు అనే అభిప్రాయానికి వచ్చిన పవన్ ఈ స్పీడ్ ను కొనసాగిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
బిజెపి జనసేన పార్టీతో పొద్దు ప్రస్తుతం కొనసాగుతోంది.ఈ పొత్తు ఉండడంతో బిజెపి అదుపు ఆజ్ఞలలో ఉంటూ వచ్చిన పవన్, ఆ పార్టీ వైఖరి తో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తమను బిజెపి మిత్రపక్షంగా గుర్తించి తగిన గౌరవం మర్యాదలు ఇవ్వడం లేదు అనే బాధ పవన్ తో పాటు, ఆ పార్టీ నాయకులలోను ఉంటూ వచ్చింది.ఇదిలా ఉండగానే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు త్వరలో రాబోతున్న తరుణంలో, ఆ ప్రాంతంలో తమకు పట్టు ఉందని , తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బీజేపీ కి సంకేతాలు ఇచ్చినా, ఆ పార్టీ నేతలు పట్టించుకోకపోగా, బిజెపి అభ్యర్థి ని తిరుపతి లోక్ సభ ఎన్నికలకు దింపాలి అని చూస్తూ ఉండడం పవన్ కు ఆగ్రహం కలిగిస్తోంది.
అందుకే బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరిన్ని ఏర్పాట్లు చేసుకోక ముందే, ఈ విషయంలో పవన్ స్పీడ్ పెంచారు.ఆ పార్లమెంటు పరిధిలోని జిల్లాలో ఇప్పటికే రైతులకు బాసటగా టూర్ లు వేశారు.
మొదట్లో బిజెపి తిరుపతి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశంతో స్పీడ్ పెంచి, పార్టీ ముఖ్య నేతలు అందరినీ పిలిచి మరి మీటింగ్ పెట్టడం, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, మీడియా సమావేశాలు పెట్టి హడావిడి చేయడం వంటివి చేశారు.ఇక్కడ ఖచ్చితంగా బిజెపి అభ్యర్థి మాత్రమే పోటీ చేస్తారు అన్నట్టుగా సోము వీర్రాజు వ్యవహరించారు.
కానీ అకస్మాత్తుగా పవన్ వేరే రూట్ లో రావడం, బిజెపి తమకు మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా తిరుపతిలో జనసేన అభ్యర్థి మాత్రమే పోటీ చేస్తారు అనే విధంగా హడావుడి చేయడం వంటి వ్యవహారాలు చేశారు.ఇప్పటికే బిజెపి జనసేన కలిసి కమిటీని వేసుకుని అభ్యర్థిని డిసైడ్ చేయాలని నిర్ణయించుకున్నాయి.
అంతిమంగా బిజెపి అభ్యర్థి వైపే ఆ పార్టీ పెద్దలు మొగ్గు చూపిస్తారు అని పవన్అభిప్రాయపడుతున్నారు.ఈ విషయంలో బిజెపి ఎంత ఒత్తిడి చేసినా, పవన్ ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదనే ఉద్దేశంలో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కోసం త్యాగం చేశామని, తమ కోసం బిజెపి ఎందుకు త్యాగం చేయదు అనే అంశాన్ని పరోక్షంగా పవన్ హైలెట్ చేస్తున్నారు.ఒక్కసారిగా పవన్ వైఖరిలో మార్పు రావడం తో బిజెపి వర్గాలు సైతం ఆశ్చర్య పోతున్నాయి.
జనసేన వర్గాలు మాత్రం పవన్ ఈ స్పీడ్ ను ముందు ముందు కొనసాగించాలని కోరుతున్నాయి.